Lakshmi Devi Blessings : లక్ష్మీదేవిని పూజిస్తే ధనంతోపాటు శుభాలు కూడా కలుగుతాయని అందరికీ తెలిసిందే. ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ధనానికి, ఐశ్వర్యానికి అధిపతి. ఆమెను పూజిస్తే అన్నీ శుభాలే కలుగుతాయని, ధనం మిక్కిలిగా సమకూరుతుందని చాలా మంది నమ్మకం. వ్యాపారస్తులైతే తమ దుకాణాల్లో, షాపులలో, ఇతర ప్రదేశాల్లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని కచ్చితంగా పెట్టుకుంటారు. అలా చేస్తే వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించవచ్చని వారి నమ్మకం. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధించాలంటే పూజ మాత్రమే కాదు, ఇంకా కొన్ని పనులు కూడా చేయాల్సి ఉంటుందట. అప్పుడు ఆ దేవి కటాక్షం ఇంకా ఎక్కువగా కలుగుతుందట. ఈ క్రమంలో లక్ష్మీదేవి కోసం ఏమేం పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ నెమలి ఫించాన్ని తెచ్చుకుని దాన్ని ఇంట్లో మీరు లక్ష్మీదేవిని పూజించే దగ్గర పెట్టుకోవాలి. దీంతో ఆ దేవి అనుగ్రహం లభిస్తుందట. ఎందుకంటే సరస్వతీ దేవి కూర్చునేది నెమలిపైనే కదా. అంతేకాదు, నెమలి ఫించాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల నెగెటివ్ శక్తి అంతా వెళ్లిపోయి, పాజిటివ్ శక్తి వస్తుందట. అది మనకు చాలా మేలు చేస్తుందట. బంగారం లేదా వెండితో చేసిన నాణాన్ని పూజ గదిలో ఉంచాలి. ఆ నాణంపై లక్ష్మీ దేవి, వినాయకుడు ఉంటే ఇంకా చాలా మంచిదట. దాంతో మిక్కిలిగా సంపద కలుగుతుందట.
తామర పూవులంటే లక్ష్మీ దేవికి ఎంతో ఇష్టమట. ఆ దేవి తామరపూవు పైనే కూర్చుంటుంది కాబట్టి దాంతో ఆమెను పూజిస్తుంటే అన్నీ లాభాలే కలుగుతాయట. ధనం బాగా సమకూరుతుందట. లక్ష్మీదేవి తామరపూవు మీద కూర్చుని ఉండి సిరులు కురిపిస్తున్నట్టుగా ఉంటే చిత్రపటం లేదా ప్రతిమను ఇంట్లో పెట్టుకుని నిత్యం పూజించాలి. దీంతో సిరులు కురుస్తాయట. ఇంట్లోని వారందరికీ అంతా మంచే జరుగుతుందట. మహిళలు నుదుట ధరించే కుంకుమ, చేతులకు ధరించే గాజులు, గోరింటాకు వంటి పలు రకాల అలంకరణ వస్తువులను ఇంట్లో ఉంచాలట. దీంతో ఆ ఇంట్లోని వారికి అంతా మంచే జరిగి సంపద సిద్దిస్తుందట.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…