lifestyle

Over Weight : అధిక బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్నారా.. అయితే ఈ ఒక్క చిట్కా చాలు..!

Over Weight : నేటి త‌రుణంలో అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు చాలా మంది నానా తంటాలు ప‌డుతున్నారు. అందులో భాగంగానే అనేక ర‌కాల డైట్‌ల‌ను పాటిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌లి కాలంలో కీటోడైట్ బాగా పాపుల‌ర్ అయింది. అందులో కేవ‌లం కొవ్వులు, ప్రోటీన్లు ఉన్న ఆహారా ప‌దార్థాల‌నే ఎక్కువ‌గా తినాల్సి ఉంటుంది. కార్బొహైడ్రేట్ల‌ను అస్స‌లు తీసుకోరాదు, లేదా చాలా చాలా త‌క్కువ‌గా తినాలి. దీంతో శ‌రీరం కీటో శ‌క్తి మీద ప‌నిచేస్తుంది. అప్పుడు అధిక బ‌రువు త‌గ్గ‌డంతోపాటు ఇత‌ర ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. అయితే ఈ డైట్ మాత్ర‌మే కాదు.. అధిక బ‌రువు త‌గ్గేందుకు ఇంకో విధానం కూడా మ‌న‌కు అందుబాటులో ఉంది.. అదే ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్‌.. ఇంత‌కీ ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి..? దాన్ని ఎలా చేయాలి..? దాంతో మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయి..? ఇప్పుడు తెలుసుకుందాం..!

ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే.. తినే తిండికి బ్రేక్ ఇచ్చి ఫాస్టింగ్ (ఉప‌వాసం) ఉండ‌డం.. ఏంటీ.. అర్థం కాలేదా..? ఏమీ లేదండీ.. రోజుకు 24 గంట‌లు క‌దా.. అందులో 14 నుంచి 16 లేదా 18, 20 గంట‌ల పాటు ఉప‌వాసం ఉండాలి. మిగిలిన స‌మ‌యంలో మాత్ర‌మే ఆహారం తినాలి. దీన్నే ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. అంటే.. 24 గంట‌ల్లో 14 గంట‌లు ఏమీ తిన‌కుండా మిగిలిన 10 గంట‌ల్లో ఆహారం తినాల‌న్న‌మాట‌. అలాగే 16 గంట‌లు ఫాస్టింగ్ ఉంటే మిగిలిన 8 గంట‌ల్లోనే ఆహారం తీసుకోవాలి. ఇక 18 లేదా 20 గంటల పాటు ఫాస్టింగ్ ఉంటే.. మిగిలిన 6 లేదా 4 గంట‌ల పాటు మాత్ర‌మే ఆహారం తినాలి. ఇదీ ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ రూల్‌..!

Over Weight

అయితే రోజు విడిచి రోజు లేదా రెండు రోజుల‌కు, మూడు రోజుల‌కు ఒక‌సారి రోజు మొత్తం ఆహారం తిన‌కుండా కేవ‌లం నీరు లేదా ఇత‌ర డ్రింక్స్ మాత్ర‌మే తాగి ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేవారు కూడా ఉన్నారు. అయితే ఎలా చేసినా ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్‌తో మ‌నకు అనేక ర‌కాల లాభాలు క‌లుగుతాయి. అవేమిటంటే.. ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ముఖ్య‌మైన లాభాల్లో ఒక‌టి.. అధిక బరువు త‌గ్గ‌డం. ఈ ఫాస్టింగ్ చేయ‌డం వ‌ల్ల బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గ‌వ‌చ్చు. అలాగే బ‌రువు కూడా నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ రోజూ చేస్తే డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ముఖ్యంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ త‌గ్గుతుంది. టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కార‌ణంగానే షుగ‌ర్ ఎక్కువ‌వుతుంది. క‌నుక అలాంటి వారు ఈ ఫాస్టింగ్ చేస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ త‌గ్గుతుంది. దీంతో డ‌యాబెటిస్ స‌మ‌ర్థ‌వంతంగా అదుపులో ఉంటుంది. ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో జీవ‌క్రియ‌లు స‌రిగ్గా జ‌రుగుతాయి. హార్మోన్ల స‌మ‌స్య‌లు పోతాయి. ముఖ్యంగా థైరాయిడ్ ఉన్న‌వారు ఈ ఫాస్టింగ్ చేస్తే ఉప‌యోగం ఉంటుంది.

ఈ ఫాస్టింగ్ లో జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కే కాదు, శ‌రీరంలోని ఇత‌ర భాగాలకు కూడా చాలా స‌మ‌యం పాటు రెస్ట్ దొరుకుతుంది. దీంతో ఆ భాగాలు ఆ స‌మ‌యంలో ఏమైనా మ‌ర‌మ్మ‌త్తులు ఉంటే చేసుకుంటాయి. ఫ‌లితంగా ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. శ‌రీర రోగ నిరోధ‌క శక్తి పెరుగుతుంది. అలాగే క్యాన్స‌ర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ వ‌ల్ల శ‌రీరానికి ఒక క్ర‌మ‌బ‌ద్ద‌మైన జీవ‌న విధానం అల‌వాటు అవుతుంది. అందుకు త‌గ్గట్టుగా జీవ‌గ‌డియారం ప‌నిచేస్తుంది. అంటే.. రోజులో ఒకే టైంలో ఆహారం తింటారు.. మిగిలిన టైంలో రెస్ట్ ఇస్తారు క‌నుక‌.. ఆ స‌మ‌యంలోనే అవ‌య‌వాలు ప‌నిచేయాల‌నే నిర్ణ‌యానికి వ‌స్తాయి. దీంతో అన్ని అవ‌య‌వాలు అందుకు త‌గ్గ‌ట్టుగా ప‌నిచేస్తాయి. ఎప్పుడు ఏ అవ‌య‌వం ప‌నిచేయాలో అదే ప‌నిచేస్తుంది. ఇత‌ర అవ‌య‌వాలు చాలా వ‌ర‌కు రెస్ట్ తీసుకుంటాయి. ఈ క్ర‌మంలో ఆరోగ్యంగా ఉంటారు. అలాగే గుండెపై ఎక్కువ భారం ప‌డ‌కుండా ఉంటుంది. దీంతో గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM