Kamaskhi Temple : ఈ ఆల‌యానికి వెళ్తే.. ఎంత‌టి క‌ష్టాలైనా స‌రే పోతాయి..!

August 23, 2023 7:57 AM

Kamaskhi Temple : మన భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. హిందూ ధర్మంలో అమ్మవారు కూడా వివిధ రూపాలలో ఉంటారు. ఆ రూపాలలో పూజలు కూడా అందుకుంటారు. అమ్మవారిని నమ్మి, కోరి కొలిచిన భక్తులపై క‌చ్చితంగా అమ్మవారి కటాక్షం లభిస్తుంది. అమ్మవారు కరుణ చూపిస్తారు. అమ్మవారు భక్తులని కాపాడతారు.

కాంచీపురంలో వెలసిన కామాక్షి తల్లిని దర్శించుకుంటే, మన కష్టాలన్నీ గట్టెక్కిపోతాయి. తల్లిని దర్శించుకోవడానికి ఎన్నిసార్లు భక్తులు సంకల్పించుకున్నా వెళ్లలేరట. కంచి కామాక్షి తల్లిని దర్శించుకోవడానికి, మానవ సంకల్పం చాలదు. తల్లి సంకల్పమే ప్రధానం. సమస్త భూమండలానికి నాభి స్థానం కంచి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు, మన నాభి నుండే తల్లి పోషిస్తుంది. కామాక్షి తల్లిని దర్శించుకుంటే, కష్టాలు ఏమీ ఉండవు. ఇక్కడ సుగంధ కుండలాంబ అవతారంలో అమ్మవారిని దర్శించుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి రూపం ఉండదు. ప్రపంచంలో ఎక్కడ దర్శించలేని విధంగా ఇక్కడ ఢంకా వినాయకుడు ఉంటాడు.

Kamaskhi Temple all problems will go away if you visit this
Kamaskhi Temple

అలాగే కామాక్షి ఆలయంలో అరూపా లక్ష్మీ దేవి దర్శనం ఇస్తుంది. కామాక్షి తల్లిని దర్శించుకున్న తర్వాత ఆ కుంకుమ ప్రసాదాన్ని అరూపా లక్ష్మి తల్లికి ఇచ్చి ప్రసాదంగా తీసుకుంటే భర్తని నిందించిన దోషమంతా కూడా పోతుంది. స్త్రీ, పురుషులు ఎవరైనా కూడా అరూపా లక్ష్మీ తల్లిని దర్శించుకోవచ్చు. అప్పుడు శాప విమోచనం అవుతుంది.

కామాక్షి దేవి ప్రధాన ఆలయానికి పక్కన ఉత్సవ కామాక్షి తల్లికి ఎదురుగా ఒక గోడ ఉంటుంది. ఆ గోడలో తుండిరా మహారాజు వుంటాడు. శివుడికి నంది ఎలాగో అలా అమ్మకి ఎదురుగా ఉంటాడు. కాత్యాయనీ దేవి శివుడిని భర్తగా పొందడానికి, కాంచీపురం క్షేత్రంలో తపస్సు చేస్తుంది. ఇంతటి విశిష్టత ఈ ఆలయానికి ఉంది. ఈ ఆలయానికి వెళితే ఎలాంటి కష్టమైనా సరే పోతుంద‌ని భ‌క్తులు విశ్వ‌సిస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment