ఆధ్యాత్మికం

అష్టైశ్వ‌ర్యాలు క‌లిగి ఆర్థిక స‌మ‌స్య‌లు పోవాలంటే.. ఇలా చేయాలి..!

ధనం.. ఇది అందరికీ అవసరమే. రోజు గడ‌వాలంటే డబ్బు కావాలి. అయితే ఆ డబ్బుకు సంబంధించి అంద‌రికీ సమస్యలు ఉంటాయి. చాలామందికి ఎంత కష్టపడ్డా ఆర్థిక సమస్యలు తీరవు. వాటికి రకరకాల కారణాలు ఉంటాయి. అయితే భగవంతుడి అనుగ్రహం ఉంటే తప్పక సంపదలు సొంతం అవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడ‌తారు. ఈ కింద చెప్పిన విధంగా పరిహారాలు పాటించి ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. దీంతో సంప‌ద చేతిలో నిలుస్తుంది. ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం ఎప్ప‌టికీ ల‌భిస్తుంది. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్నిసార్లు ఎంత డబ్బు వచ్చినా అది నిలవదు.. ఏవేవో కారణాతో వచ్చిన డబ్బు వచ్చినట్లు వెళ్లిపోతుంటుంది. అలాంటప్పుడు ఏమైనా దోషాలు ఉంటే వాటిని పరిహారం చేసుకోవడం ఉత్తమం. అదేవిధంగా.. కొన్ని కార్యాలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. నిత్యం ఇంట్లో దీపారాధన, సాంబ్రాణి లేదా అగరవత్తులు వెలిగించడం చేయాలి. ప్రతి శుక్రవారం గడపలకు పసుపు పూయడం, అలంకరణ, తులసి మొక్క‌ దగ్గర దీపారాధన చేయడం చేయాలి. అలాగే దగ్గర్లోని ఏదైనా గుడిని రోజూ శుభ్రం చేసి ముగ్గుపెట్టాలి.

ఆలయ ప్రాంగణంలో పూలమొక్కలు, అరటి మొక్కలు నాటాలి. స్థలం చిన్నదైతే పూల మొక్కలు నాటినా ఫ‌ర్లేదు. రోజూ వాటికి నీరు పోస్తూ మొదటిగా పూచే పూలు, కాచే పండ్లు దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. అదేవిధంగా గోసేవ, చేతనైనంతలో పేదలకు ఆహారం అందించడం, రోగులకు, వికలాంగులకు సహాయం అందించడం చేయాలి. ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతోఉండాలి. ఎదుటివారి అభ్యున్నతిని చూసి ఈర్ష్య పడకూడదు.

అందరూ బాగుపడాలనే ఆలోచన ఉండాలి. అంతేకాకుండా నిత్యం లక్ష్మీ, విష్ణు ఆరాధన, ప్రతి సోమవారం శివాభిషేకం చేయడం వ‌ల్ల సంప‌ద‌లు క‌లుగుతాయి. శివారాధన ఐశ్యర్యాన్ని ఇస్తుంది. లక్ష్మీగణపతి ఆరాధన చేయడం మంచిది. ఇవేకాకుండా లక్ష్మీదేవిని ఎర్రటి పూలు, గులాబీలతో ఆరాధించడం చేయాలి. వీలైతే శుక్రవారం ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చేస్తే తప్పక ఏడాదిలోపే మీ సమస్యలు అన్నీ పటాపంచలు అవుతాయని పండితులు చెబుతున్నారు. క‌నుక ఇలా చేసి ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం పొంద‌వ‌చ్చు. ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయి. ధ‌నం బాగా సంపాదిస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM