Economical Problems : పొరపాటున కూడా ఈ తప్పులని చేయకండి.. లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది..!

December 3, 2023 5:49 PM

Economical Problems : చాలామంది, ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సంపాదించిన డబ్బు అంతా ఏమైపోయిందో తెలియకుండా పోతుంది. ఏదో ఒకరకంగా, డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటారు. నిజానికి డబ్బు మంచి నీళ్ళల్లో ఖర్చయిపోతూ ఉంటుంది. ఆర్థిక సమస్యలు లేకుండా, లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉండాలంటే, ఈ తప్పులను అసలు చేయకండి. మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన, లక్ష్మీదేవి మన ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. మామూలుగా మనం తెలియక చేసే, కొన్ని కొన్ని పొరపాట్ల వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. మనకి ఆర్థిక సమస్యలు కలుగుతాయి.

ప్రతిరోజు మనం చేసే తప్పులు, ఆర్థిక పరిస్థితిని ఇంకాస్త దారుణంగా మార్చేస్తుంటాయి. సూర్యోదయానికి ముందు లేదా బ్రహ్మ ముహూర్తంలో, నిద్ర లేవడం మంచిది. వేకువ జామున నిద్ర లేవడం వలన, సానుకూలత పెరుగుతుంది. సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోతే, లక్ష్మీదేవికి కోపం వస్తుంది. చాలామంది అప్పుడప్పుడు, ట్యాప్ లని సరిగ్గా క్లోజ్ చేయరు. దీంతో నీళ్లు వృధాగా పోతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా ట్యాప్ లని ఫుల్లుగా కట్టాలి. నీళ్లు కనుక కారినట్లయితే, ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది.

if you do these mistakes you will get Economical Problems
Economical Problems

డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అయిపోతాయి. ఎప్పుడు పడితే అప్పుడు జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం చేయకండి. ఇలా చేస్తే కూడా, లక్ష్మీదేవికి కోపం వస్తుంది. గురువారం, ఏకాదశి విష్ణుమూర్తికి ఇష్టమైన రోజులు. ఈ రోజుల్లో కనుక లక్ష్మీదేవికి కోపం వచ్చిందంటే అపులపాలైపోతారు.

ఇంట్లో పని చెయ్యని గడియారాలని కూడా పెట్టకండి. కొంతమంది చెప్పులు తెగిపోయినా పిన్నీసులు పెట్టుకొని మరీ వేసుకుంటూ ఉంటారు. అలా చేస్తే కూడా లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఎప్పుడూ కూడా ఇల్లు శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా లేని ఇంట లక్ష్మీదేవి ఉండదు. ఈ తప్పులు చేయకుండా చూసుకోండి. అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. ఆర్థిక బాధలు ఉండవు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now