ఆదివారం సూర్యుడిని జిల్లేడు పువ్వులతో పూజిస్తే..?

September 5, 2021 11:48 AM

ఆదివారం సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. యావత్ ప్రపంచానికి సూర్యుడు అధిపతి కనుక సూర్యుడిని పూజించడం వల్ల సకల సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. సూర్య భగవానునికి ఆదివారం అంటే ఎంతో ప్రీతికరం. ఈ క్రమంలోనే ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలు చేయటం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.

ఆదివారం సూర్యుడిని జిల్లేడు పువ్వులతో పూజిస్తే..?

రవి స్థానం బలపడాలంటే ఆదివారం ఉదయం నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలంటు స్నానం చేసి నిత్య పూజలతో పాటు, ఆదిత్య హృదయం, సూర్య అష్టోత్తరం వంటి శ్లోకాలను చదువుతూ ఆ సూర్యభగవానుడికి ప్రత్యేకంగా పూజలు చేయాలి. ఇక ఈ రోజు ఉపవాస దీక్షలతో స్వామివారిని పూజించాలనుకొనేవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం స్వామివారికి నైవేద్యంగా గోధుమ రవ్వతో తయారు చేసిన ఏ పదార్థం అయినా పెట్టి ఆ తర్వాత ఉపవాస దీక్ష వదులుకోవాలి.

ఇక ఆదివారం సూర్యభగవానుడికి గన్నేరు పువ్వులు, జిల్లేడు పువ్వులు అంటే ఎంతో ప్రీతికరం కనుక వీటితో పూజ చేయడంవల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. ఆవుపాలతో చేసిన పరమాన్నంను సూర్యునికి నైవేద్యంగా సమర్పించి పూజ చేయాలి. అయితే చాలామంది ఇంట్లో సూర్యుని ఫోటో ఉండకూడదని చెబుతుంటారు, కానీ ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. సూర్యుని ఫోటోలు ఇంట్లో ఉంచుకుని పూజ చేయవచ్చు. ముఖ్యంగా సూర్య భగవానుడు ఏడు గుర్రాల మీద రథంలో వస్తున్నటువంటి ఫోటో ఉండటం ఎంతో మంచిది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment