Gods : మన పెద్దలు ఇది దేవతలు తిరిగే సమయం, దేవతలు మన ఇంట్లో తిరుగుతూ ఉంటారు. ఈ సమయంలో ఎటువంటి చెడు పనులు, చెడు మాటలు మాట్లాడకూడదు అని చెబుతూ ఉంటారు. అయితే చాలా మంది దీనిని నమ్మరు. కానీ దైవకటాక్షం, దైవానుగ్రహాన్ని మనం పొందితే దేవతలు మన ఇంట్లో కూడా తిరుగుతారని పండితులు చెబుతున్నారు. దైవానుగ్రహం మన మీద ఉన్నదని దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నట్టు మ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందని కొన్ని సూచనల ద్వారా మనకు తెలియజేస్తారు. కానీ ఈ సూచనల గురించి మనలో చాలా మందికి తెలియదు. వీటిని పట్టించుకునే సమయం కూడా మన దగ్గర ఉండదు. అయితే దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నారని మనకు తెలియజేసే ఆ సూచనలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకవేళ దేవతలు కనుక మన ఇంట్లో తిరుగుతున్నట్టే దైవానుగ్రహం మన మీద ఉన్నట్టైతే ఉదయం పూట మన ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరుస్తుందని పండితులు చెబుతున్నారు. దేవతలకు కాకి అవినాభావ సంబంధం ఉంటుందని దేవతలు మన ఇంట్లో చుట్టూ తిరుగుతున్నట్టు మన మీద దైవానుగ్రహం ఉందని వారు కాకి ద్వారా తెలియజేస్తారని పండితులు చెబుతున్నారు. అలాగే ఉదయం పూట ఉడత కనిపించినా కూడా మన ఇంట్లో దేవతలు ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. అదే విధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు ఉండడం సహజం. వంట గదిలో, పూజ గదిలో, మూలలకు బల్లులు తిరగడం సహజం. చాలా మంది వీటిని చూసి భయపడుతూ ఉంటారు. వాటిని ఇంట్లో నుండి బయటకు పంపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము.
కానీ మన ఇంట్లో కనుక ఎక్కువగా బల్లులు ఉంటే బల్లులు మన కంటికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటే మనపై లక్ష్మీ దేవి కటాక్షం ఉంటుదని త్వరలోనే ఆర్థిక బాధలు, సమస్యలు అన్ని తొలగిపోతాయని లక్ష్మీ దేవి మన ఇంటికి రాబోతుందని పండితులు చెబుతున్నారు. అలాగే మనం ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేస్తూ ఉంటాము. అలాగే దేవతలు మన ఇంట్లో కనుక మనం చిన్న వత్తి వేసి దీపం వెలిగించినప్పటికి దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంది. దేవుడు ముందు వెలిగించిన ఈ దీపం గాలి లేనప్పటికి అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. నూనె అయిపోయినప్పటికి దీపం చాలా సేపటి వరకు వెలుగుతూ ఉంటుంది.
అలాగే మన ఇంట్లో ఎల్లప్పుడూ చక్కటి వాసన వస్తుంది. అలాగే మనం పాలు స్టవ్ దగ్గర నిలబడి మరీ కాగబెడుతూ ఉంటాము. కానీ వాటిని చూస్తూ ఉన్నప్పటికి ఒక్కసారిగా పాలు పొంగిపోతూ ఉంటాయి. పాలు పొంగిపోయాయని బాధపడకూడదు. పాలు పొంగితే మన ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి ధనరూపంలో రాబోతుందని భావించాలి. ఈ విధంగా ఈ సూచనలు బట్టి మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని మనపై కూడా దైవానుగ్రహం ఉందిగా భావించాలని పండితులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…