ఇంట్లో వ్యక్తి ఎవరైనా మరణిస్తే ఇళ్లు వదిలి పెట్టాలని, శాంతిపూజలు చేయాలని పండితులు చెబుతూ ఉంటారు. అయితే చాలా మంది వీటిని నమ్మాలా వద్దా అని సంశయిస్తూ ఉంటారు. కొద్దరు పండితులు చెపినట్టు ఇళ్లు వదిలి పెడతారు. కొందరు ఏం కాదులే అని అదే ఇంట్లో ఉంటూ ఉంటారు. అసలు ఇంట్లో వ్యక్తి మరణిస్తే పూజలు చేయాలా వద్దా, ఇళ్లు వదలాలా వద్దా శాస్త్రం ఏం చెబుతుంది.. దీని గురించి పండితులు ఏమంటున్నారు అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వ్యక్తి మరణించిన సమయాన్ని బట్టి ఇళ్లు వదిలి పెట్టాల వద్దా అనేది ఉంటుందని పండితులు చెబుతున్నారు. వ్యక్తి మరణించిన సమయంలో నక్షత్రాలను బట్టి ఇంటిని 3 నుండి 6 నెలల వరకు వదిలి పెట్టాలని పండితులు చెబుతున్నారు.
అలాగే మంగళవారం కనుక మరణిస్తే ఖచ్చితంగా శాంతి పూజలు చేయాలని వారు చెబుతున్నారు. మంగళ వారం తిరుగును కోరుతుంది. ఒకవేళ శాంతి పూజలు కనుక చేయకపోతే ఆ ఇంట్లో మరో వ్యక్తి మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. అలాగే చాలా మంది వ్యక్తి మరణించిన తరువాత సంవత్సరం వరకు ఇంట్లో దీపారాధాన కానీ, దాన ధర్మాలు కానీ. అలాగే దైవదర్శనం కానీ చేయరు. కానీ వ్యక్తి మరణించిన తరువాత పెద్ద కర్మ జరిగిన తరువాత ఇంట్లో పూజలు తప్పకుండా చేయాలని పండితులు చెబుతున్నారు. ఒకవేళ పూజలు, దైవ సంబంధిత కార్య క్రమాలు కనుక చేయకపోతే ఇంట్లో భూతాలు, పిశాచాలు, ప్రేతాలు ఇంట్లోకి వచ్చి ఆవహిస్తాయని పండితులు చెబుతున్నారు.
దీంతో ఇంట్లో వ్యక్తుల మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకరి మీద ఒకరికి గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి. ఇంట్లో ఉన్న వ్యక్తులు వారి ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటారు. ఇంట్లో సమస్యల తలెత్తడం, అనారోగ్య సమస్యల బారిన పడడం వంటివి జరుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు. వ్యక్తి చనిపోయినప్పటికి పెద్ద కర్మ జరిగిన మరుసటి రోజు నుండి ఇంట్లో దీపం వెలిగించవచ్చని ఇంట్లోని ఎవరైనా వెలిగించవచ్చని పండితులు చెబుతున్నారు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…