Broad Beans : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో చిక్కుడు కాయలు కూడా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో లావుపాటి గింజలు ఉండే చిక్కుళ్లు లభిస్తాయి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఇతర ప్రాంతాల్లోనూ పలు రకాల వెరైటీలకు చెందిన చిక్కుడు కాయలు లభిస్తాయి. అయితే వేటిని తిన్నా సరే మనకు చిక్కుడు కాయల వల్ల అనేక లాభాలు కలుగుతాయి. వీటిని తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చిక్కుడు కాయల్లో మన శరీరానికి అవసరమయ్యే అతి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్, ప్రోటీన్లు, ఫోలేట్, విటమిన్ కె, విటమిన్ బి6, సి, ఐరన్, మాంగనీస్, కాపర్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. పోషకాహార లోపం ఏర్పడనీయవు. ఈ కాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే ఈ కాయల్లో ఉండే ఫోలేట్, విటమిన్ బి6 గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూస్తాయి.
చిక్కుడు కాయలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఈ కాయల్లో ఉండే ఫైబర్ షుగర్‌ను తగ్గిస్తుంది. దీంతో డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. ఇది షుగర్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేసే విషయం. చిక్కుడు కాయల్లో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వీటిని తక్కువ తిన్నా చాలు.. కడుపు నిండిపోతుంది. దీంతో ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఇది బరువు తగ్గేందుకు మేలు చేస్తుంది. ఇక ఈ కాయల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటుంది.
చిక్కుడు కాయల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఆక్సీకరణ ఒత్తిడి నుంచి మనల్ని రక్షిస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్లు రాకుండా చూస్తాయి. ఈ కాయల్లో మాంగనీస్, కాపర్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఈ కాయల్లో అధికంగా ఉండే విటమిన్ కె శరీరం కాల్షియంను అధికంగా శోషించుకునేలా చేస్తుంది. దీంతో ఎముకలు గట్టిపడతాయి. ఈ కాయల్లో కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటే మనకు శక్తి లభిస్తుంది. కండరాల పెరుగుదల సరిగ్గా ఉంటుంది. ఇలా చిక్కుడు కాయలతో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…