ఆధ్యాత్మికం

Holy Basil Plant : తులసి మొక్క‌ను పెంచుతున్న వారు క‌చ్చితంగా ఈ నియ‌మాల‌ను పాటించాలి..!

Holy Basil Plant : ప్రతి ఒక్క ఇంట్లో కూడా తులసి మొక్క ఉండాలి. తులసి మొక్కని ప్రతి ఒక్కరూ కూడా పూజిస్తూ ఉంటారు. తులసి మొక్క లేని ఇల్లు దరిద్రంతో ఉంటుంద‌ని పండితులు అంటున్నారు. అయితే తులసి మొక్కకి ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాణాల్లో శ్రీకృష్ణుడికి తులాభారం వేసినప్పుడు, ఎంతకీ తూగని శ్రీకృష్ణుడు తులసి మొక్క కాడ వేయగానే తూగుతాడు. తులసి మొక్కకి ఉన్న దైవ శక్తి అటువంటిది. హిందూ ఆచార సంప్రదాయాలలో తులసికి అత్యంత ప్రాధాన్యత ఉంది.

తులసిని ప్రత్యేకంగా కోటలో ఉంచి పూజ చేస్తారు. అయితే, తులసి మొక్కని పెంచేటప్పుడు మాత్రం కొన్ని పొరపాట్లని చేయకూడదు. ముఖ్యంగా ఎలా పడితే అలా తులసి మొక్కని పెంచకూడదని శాస్త్రం అంటోంది. కాబట్టి తులసికి సంబంధించి కొన్ని వాస్తు నియమాలను ఇప్పుడు చూసేద్దాం. ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోవడం మంచిది. తులసి మొక్కని కానీ తులసి కోటని కానీ ఎప్పుడూ తూర్పు వైపు పెట్టడం మంచిది.

Holy Basil Plant

ఉత్తరంలో కానీ, ఈశాన్య దిక్కున కానీ పెట్టుకోవచ్చు. ఈ దిక్కుల్లో ఉంటే, అంతా మంచి జరుగుతుంది. మీకు శుభం కలుగుతుంది. తులసి మొక్క పెట్టిన చోట, శుభ్రంగా ఉండాలి. బాగా కాంతి వచ్చేటట్టు ఉండాలి. చీకట్లో ఉండకూడదు. అలా ఉంటే ఇంటికి దరిద్రం. దుమ్ము ఉన్నచోటని కూడా తులసి మొక్కని పెట్టకూడదు. తులసి మొక్కని పెట్టినప్పుడు, కాస్త ఎత్తైన ప్రదేశంలో పెట్టాలి. అంటే ఏదైనా కుండీలో కానీ తులసికోటలో కానీ మీరు పెట్టుకోవచ్చు.

తులసి మొక్కకి కచ్చితంగా రోజు నీళ్లు పొయ్యాలి. తులసి ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత పాజిటివ్ ఎనర్జీని ఇంటికి తీసుకువస్తుంది. దాంతో కుటుంబ సభ్యులందరికీ అదృష్టం కలుగుతుంది. తులసి మొక్క దగ్గర రోజు పూజ చేయడం మంచిది. కొంతమంది తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అలానే ఇంకొందరు దీపారాధన చేస్తూ ఉంటారు. ఇలా తులసి దగ్గర ఏ పూజలు చేసినా కూడా అభివృద్ధికి అది సహాయపడుతుంది. కాబట్టి ఈ విధంగా పాటిస్తూ ఉండండి. అప్పుడు కష్టాలు ఏమీ ఉండవు. సంతోషంగా ఉండొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM