Weight Gain : బరువు తక్కువగా ఉన్నవాళ్లు, బాగా సన్నగా ఉన్న వాళ్ళు కొన్ని ఆహార పదార్థాలని తీసుకుంటూ ఉంటారు. వీటిని తీసుకోవడం వలన బలంగా మారవచ్చని, కండ పడుతుందని అంటుంటారు. అయితే నిజంగా కండ పట్టాలంటే వీటిని కచ్చితంగా తీసుకోండి. అప్పుడు సులభంగా బరువు పెరగొచ్చు. ఒళ్ళు వస్తుంది. బరువు పెరగాలంటే కచ్చితంగా వీటిని పాటించండి. మొలకలతోపాటుగా నానబెట్టిన పల్లీలను కూడా తీసుకోండి.
ఉదయాన్నే ఈ రెండింటినీ తీసుకోవడం వలన బరువు పెరగడానికి అవుతుంది. కండ కూడా త్వరగా పడుతుంది. వేరుశనగలలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తీసుకోవడం మంచిది. మాంసం కంటే కూడా వేరుశనగలలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కచ్చితంగా తీసుకోవడం మంచిది. ఏదైనా పండు కానీ ఖర్జూరాన్ని కానీ వీటితోపాటుగా తీసుకోండి.
అరటిపండు లేదంటే సపోటా లాంటి పండ్లను మీరు తీసుకోవచ్చు. ఉదయం 8 గంటల లోపు మీరు అల్పాహారం సమయంలో వీటన్నింటినీ తీసుకోండి. భోజనం సమయంలో మీరు ముడి బియ్యాన్ని తీసుకోండి. పాలిష్ బియ్యం వద్దు. భోజనంలో 60 శాతం అన్నం, 40 శాతం కూరలు పెట్టుకుని తీసుకోవాలి. తెలగపిండితో చేసిన కూరలను మీరు తీసుకుంటే మంచిది. అలానే కందిపప్పు, పెసరపప్పు వంటివి కూడా మీరు కూరల్లో వాడుకోండి.
మీ బరువుని ఇవి బాగా పెంచుతాయి. కాబట్టి కచ్చితంగా తీసుకుంటూ ఉండండి. రాత్రిపూట మాత్రం రోటీ వంటివి తీసుకోవద్దు. డిన్నర్ లో మీరు ఒక పెద్ద కొబ్బరి చెక్క దానితో పాటుగా డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ ని మీరు ఉదయం నానబెట్టుకుని రాత్రి తీసుకుంటే మంచిది. దానితో పాటుగా మీరు పండ్లు, ఎండు ఖర్జూరం వంటివి కూడా తీసుకోండి. ఇవన్నీ తీసుకుంటే, సులభంగా మీరు రెండు మూడు కేజీలు పెరుగుతారు. అలానే మోషన్ కూడా ఫ్రీగా అయ్యేటట్టు చూసుకోండి. ఇలా ఈ చిట్కాలను పాటిస్తే ఈజీగా కండ పడుతుంది.
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…