మన హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం తెలుగు నెలలో 5వ నెల. ఐదవ నెల అయినటువంటి శ్రావణమాసం అంటే హిందువులు ఎంతో పరమ పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ నెల మొత్తం వివిధ రకాల పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ ఎంతో బిజీగా ఉంటారు.అదే విధంగా ఈ శ్రావణ మాసంలో కూడా ఎన్నో పండుగలు వస్తాయి. మరి శ్రావణమాసంలో వచ్చే పండుగలు ఏవి… అవి ఎప్పుడు వచ్చాయి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
నాగ పంచమి: శ్రావణ మాసంలో నాగపంచమిని హిందువులు ఎంత పవిత్రంగా భావిస్తారు.ఈ పంచమి రోజు పుట్టకు వెళ్లి పాలుపోసి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ పండుగను ఆగస్టు 13న జరుపుకోనున్నారు.
భాను సప్తమి: భాను సప్తమిరోజు సూర్యుడు మొట్టమొదటిసారిగా ఏడుకొండలపై ఈ భూమికి వచ్చాడని, అప్పటినుంచి ఈ భూమిపై జీవనం ప్రారంభమైందని భావిస్తారు. అందుకే ఆ రోజున రథసప్తమి భావించి పెద్ద ఎత్తున పూజలు చేస్తారు. ఆగస్టు 15వ తేదీన భాను సప్తమి పండుగను జరుపుకుంటారు.
వరలక్ష్మీ వ్రతం: మహిళలు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగలలో వరలక్ష్మీ వ్రతం ఒకటి. ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 20 వ తేదీన వచ్చింది.
ఓనం పండుగ: ఓనం పండుగను తెలుగు రాష్ట్రాలలో కాకుండా కేరళలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ ఆగస్టు 21వ తేదీ వచ్చింది.
రక్షాబంధన్: అన్నాచెల్లెల ప్రేమకు గుర్తుగా రాఖీ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది రాఖీ పండుగ ఆగస్టు 22 వ తేదీ వచ్చింది.
కృష్ణాష్టమి: విష్ణుమూర్తి కృష్ణుడు అవతారంలో ఈ భూమిపై జన్మించిన రోజున కృష్ణాష్టమి అంటారు. ఈ ఏడాది కృష్ణాష్టమి ఆగస్టు 30 వ తేదీ వచ్చింది.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…