సాధారణంగా ఉప్పును మనం వంటల్లో వేస్తుంటాం. దీని ఉపయోగం రోజూ ఉంటుంది. ఇది లేకుండా వంటలు పూర్తి కావు. ఉప్పు లేని ఆహారాలను మనం తినలేం. అయితే కేవలం వంటలకే కాదు, ఉప్పు మనకు పలు విధాలుగా ఉపయోగపడుతుంది. దాన్ని ఏయే పనులకు ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
* కాఫీ మరీ చేదుగా ఉంటే అందులో కొద్దిగా ఉప్పు కలిపితే చాలు చేదు తగ్గుతుంది.
* గోరు వెచ్చని నీటిలో ఉప్పు కలిపి ఆ మిశ్రమంతో ఫ్రిజ్ లోపలి భాగాన్ని శుభ్రం చేయవచ్చు. లోపల తళతళా మెరుస్తుంది.
* చెక్క టేబుల్స్, ఇతర వస్తువులపై పడే నీళ్ల మరకలను ఉప్పుతో తొలగించవచ్చు. అందుకు ఉప్పు, నీళ్లు కలిపిన మిశ్రమంతో శుభ్రం చేయాలి.
* నీటిలో ఉప్పు వేసి అందులో స్పాంజిలను రాత్రంతా నానబెట్టాలి. ఇలా తరచూ చేస్తుంటే స్పాంజిలు త్వరగా పాడుకాకుండా ఉంటాయి.
* ఒక టీస్పూన్ ఉప్పు, ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను తీసుకుని వాటిని అర కప్పు నీటిలో కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. ఇది సహజసిద్ధమైన మౌత్ వాష్ లా పనిచేస్తుంది. దీంతో నోటిని శుభ్రం చేసుకోవచ్చు.
* ఒక పాత్రలో కొద్దిగా నీటిని పోసి అందులో ఉప్పు వేసి కలపాలి. ఆ నీటిలో కోడిగుడ్డును వేయాలి. గుడ్డు మునిగితే అది తాజాగా ఉన్నట్లు లెక్క. గుడ్డు తేలితే అది పాడైపోయినట్లు లెక్క.
* దుస్తులపై పడిన గడ్డి మరకలను తొలగించడంలోనూ ఉప్పు పనిచేస్తుంది. మరకలపై నిమ్మరసం రాసి వాటిపై ఉప్పు చల్లాలి. తరువాత కొంత సేపు ఉంచి ఉతికేయాలి. దీంతో మరకలు పోతాయి.
* అర కప్పు గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడా, నిమ్మరసం లను కలిపి అందులో చేతివేళ్లను 10 నిమిషాల పాటు ఉంచాలి. దీంతో వేళ్లు, గోర్లు ఆరోగ్యంగా మారుతాయి. అందంగా, మృదువుగా కనిపిస్తాయి.
* కోడిగుడ్డు నేలపై పడి పగిలితే శుభ్రం చేశాక కూడా వాసన వస్తుంది. ఒక పట్టాన ఆ వాసన పోదు. అలాంటి సందర్భంలో గుడ్డు పగిలిన వెంటనే దానిపై ఉప్పు చల్లాలి. 20 నిమిషాల తరువాత కడిగేయాలి. దీంతో వాసన రాకుండా ఉంటుంది.
* చీమలు వెళ్లే దారిలో ఉప్పు చల్లితే చీమలు దారి తప్పుతాయి. చీమలను ఇలా తరిమేయవచ్చు.
* ఉప్పు, నీళ్లు కలిపిన మిశ్రమంతో ఇత్తడి, రాగి పాత్రలను తోమితే అవి తళతళా మెరుస్తాయి.
* ఒక కప్పు నీటిలో కొద్దిగా ఉప్పు కలపాలి. అందులో టూత్ బ్రష్‌ను బ్రిజిల్స్ మునిగేలా ఉంచాలి. 10-15 నిమిషాలు ఉంచాక తీసి కడిగాలి. ఇలా చేస్తే టూత్ బ్రష్‌లను ఎక్కువ కాలం వాడవచ్చు.
* దుస్తులపై పడిన రక్తపు మరకలను ఉప్పు పోగొడుతుంది. అందుకు గాను ఉప్పు, నీటి మిశ్రమాన్ని మరకలపై రాయాలి. కాసేపు ఆగాక ఉతికేయాలి. మరకలు పోతాయి.
* నిమ్మరసం, ఉప్పు కలిపిన మిశ్రమంతో శుభ్రం చేస్తే లోహపు వస్తువులకు పట్టే తుప్పు వదులుతుంది.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…