వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదని చెబుతారు.. ఎందుకో తెలుసా?

September 9, 2021 4:20 PM

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్దశి రోజు వినాయక చవితి ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈ క్రమంలోనే వినాయక చవితి ఈ ఏడాది సెప్టెంబర్ 10వ తేదీ శుక్రవారం వచ్చింది. ఈ క్రమంలోనే భక్తులు పెద్ద ఎత్తున వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ స్వామి వారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి స్వామివారి పూజలో పాల్గొంటారు.

వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదని చెబుతారు.. ఎందుకో తెలుసా?

మనం వినాయకుడిని తొలి పూజ్యుడిగా భావిస్తాము. మనం ఏదైనా ఒక శుభకార్యాన్ని చేయాలని భావించినప్పుడు ఆ శుభకార్యంలో ఆటంకాలు కలగకుండా ఉండాలని వినాయకుడికి పూజ చేస్తాం. ఎంతో పవిత్రమైన ఈ వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదని చెబుతారు. వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వారు ఆ ఏడాదిలో నీలాపనిందలు పాలవుతారని, అందుకోసమే చంద్రుని చూడకూడదని పురాణాలు చెబుతున్నాయి. అసలు చంద్రుడిని వినాయక చవితి రోజు ఎందుకు చూడకూడదనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

వినాయక చవితి రోజు వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడిగా గణపతికి విఘ్నాధిపతిగా ఆధిపత్యం కట్టబెట్టడం వల్ల ఆరోజు వినాయకుడికి భక్తితో కుడుములు, ఉండ్రాళ్ళు వంటి వివిధ రకాల పిండి వంటలు, పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ క్రమంలోనే వాటన్నింటిని తిన్న వినాయకుడికి పొట్ట లావుగా ముందుకు రావడంతో ఎంతో ఇబ్బంది పడతాడు. దీంతో అది చూసిన చంద్రుడు నవ్వడంతో ఆగ్రహం చెందిన పార్వతీ దేవి ఎవరైతే వినాయక చవితి రోజు చంద్రుని వంక చూస్తారో అలాంటివారిపై నీలాపనిందలు వస్తాయని శాపం పెడుతుంది. అందుకే వినాయక చవితి రోజు చంద్రుడి వంక చూడకూడదని పురాణాలు చెబుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment