మనం దేవుళ్లకు పూజ చేయాలంటే తప్పనిసరిగా పుష్పాలను ఉపయోగిస్తాము. వివిధ రకాల పుష్పాలను స్వామివారికి అలంకరించి పూజలు చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై కలుగుతుందని భావిస్తాము. ఇలా పూజకు ఉపయోగించే ఎంతో పవిత్రమైన పుష్పాలలో పారిజాత పుష్పాలు ఒకటి. ఈ పారిజాత పుష్పాలను దైవ సమానంగా భావిస్తాము. పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు సాగర మధనం చేస్తున్న సమయంలో సముద్ర గర్భం నుంచి ఎన్నో వస్తువులు ఉద్భవించాయి.
ఇలా ఉద్భవించిన వాటిలో పారిజాత వృక్షం కూడా ఒకటి. సముద్రగర్భం నుంచి పారిజాత వృక్షం ఉద్భవించగానే విష్ణుమూర్తి ఈ వృక్షాన్ని స్వర్గానికి తీసుకువెళ్ళాడు. అయితే సత్యభామ కోరిక మేరకు శ్రీ కృష్ణుడు స్వర్గ లోకం నుంచి ఈ వృక్షాన్ని భూమి పైకి తీసుకువచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. ఎంతో పవిత్రమైన ఈ పారిజాత పుష్పాలు రాత్రి సమయంలో వికసిస్తాయి.
ఇతర పుష్పాల మాదిరిగా చెట్టుపై నుంచి పువ్వులను కోసి ఈ పారిజాత పుష్పాలతో దేవుళ్లకు పూజ చేయకూడదు. ఈ పుష్పాలు వికసించి నేలపై రాలిన వాటిని తీసుకొని స్వామివారికి పూజ చేయాలి. ఈ క్రమంలోనే పారిజాత వృక్షం కింద ఆవుపేడతో అలికి ఉండాలి. ఇలా అలికిన పేడపై పడిన పుష్పాలను తీసుకుని స్వామివారికి పూజ చేయాలి. ఈ పారిజాత పుష్పాలను ఇతరుల నుంచి తీసుకోకూడదు. ఇలా తీసుకుని పూజ చేయటం వల్ల మనం పూజ చేసిన పుణ్యఫలం మనకి కాకుండా ఈ పుష్పాలను ఇచ్చిన వారికి చెందుతుంది. అలాగే ఈ పారిజాత వృక్షం ఎవరి ఇంటి ఆవరణంలో ఉంటుందో ఆ ఇంట్లోవారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈ పారిజాత పుష్పాలు నుంచి వచ్చే సువాసనల వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…