రావి చెట్టుని మనం పూజిస్తూ ఉంటాము. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం, అత్యంత పవిత్రమైన చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి. హిందూ మతస్తులు ఈ పవిత్రమైన వృక్షాన్ని ఆరాధిస్తూ ఉంటారు. రావి చెట్టు ని విష్ణు రూపంగా చెప్తారు. కనుక, రావి చెట్టు విష్ణువుగా, వేప చెట్టు మహాలక్ష్మి గా భావించి వేప చెట్లకి, రావి చెట్లకు కలిపి పెళ్లి చేస్తూ ఉంటారు కూడా. పైగా రావి చెట్టుకి, వేప చెట్టుకి పెళ్లి చేస్తే, సాక్షాత్తు లక్ష్మీనారాయణులకి వివాహం చేసినట్లుగా భావిస్తారు.
రావి చెట్టు పుల్లలని పవిత్రమైన యజ్ఞ యాగాదులకి మాత్రమే వాడతారు. రావి చెట్టులో శ్రీమహావిష్ణువు కొలువై ఉంటాడు. శనివారం రోజు రావి చెట్టుని పూజిస్తే, మనకు శ్రేయస్సు, ఆరోగ్యం లభిస్తాయి. రావి చెట్టుకి నీళ్లు పోయడం వలన శని మనల్ని ఎలాంటి కష్టాలనుండి అయినా సరే కాపాడతాడు అని పండితులు చెప్తున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు రావిచెట్టులో నివసించారని కొందరు నమ్ముతారు.
ఔషధ గుణాలు కూడా రావి చెట్టులో ఉంటాయి. రావి చెట్టు అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, తెలివితేటల్ని, సంతానాన్ని తీసుకు వస్తుంది. రావి చెట్టుని పూజిస్తే, వివాహ జీవితంలో అడ్డంకులు, కలహాలు తొలగిపోతాయి. రావి చెట్టుని ఆరాధిస్తే, అదృష్టం కూడా కలిసి వస్తుంది. జ్ఞానం కూడా పెరుగుతుంది. మగ పిల్లలు కావాలనుకునే మహిళలు, ఈ చెట్టు చుట్టూ ఎర్రటి దారం లేదా ఎర్రని వస్త్రాన్ని చుడతారు.
శనివారం ఈ చెట్టు ని పూజిస్తే, సంపద పెరుగుతుంది. క్రమంగా ఈ చెట్టుని పూజిస్తే, పిల్లల పెరుగుదల, అభివృద్ధి బాగుంటుంది. పెళ్లి కాని వారు రావి చెట్టు ఆకులను తీసి స్నానం చేసే నీళ్లలో వేసుకుని, స్నానం చేస్తే, పెళ్లి కుదురుతుంది. ఆదివారం నాడు రావి చెట్టుకి నీళ్లు పోయకూడదు. గర్భం ధరించలేని వివాహిత మహిళలు, రావి ఆకులని తీసుకుని నీటిలో నానబెట్టి, ఉదయాన్నే రావి ఆకు ఉంచిన నీటిని తాగితే పిల్లలు కలుగుతారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…