Lord Ganesh And Lakshmi : మొట్టమొదట మనం వినాయకుడిని పూజిస్తాము. ఏ దేవుడిని పూజించాలన్నా, ముందు గణపతిని పూజించి, ఆ తర్వాత మనం మిగిలిన దేవతలని, దేవుళ్ళని ఆరాధిస్తూ ఉంటాము. అలానే, రాముడుని కొలిచేటప్పుడు, రాముడితో పాటుగా సీతాదేవి, లక్ష్మణులను కలిపి పూజిస్తూ ఉంటాము. లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు, గణపతిని కూడా పూజిస్తూ ఉంటారు. సంపద యొక్క దేవత అయిన లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తూ గణపతిని కూడా పూజిస్తారు.
డబ్బుకి సంబంధించిన లక్ష్మీదేవి కంటే కూడా ప్రత్యేకంగా వినాయకుడిని పూజిస్తూ ఉంటాము. వినాయకుడితో కలిపి ఉన్న లక్ష్మీదేవిని చాలామంది ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అందుకు కారణాలు ఏంటి..?, వీళ్ళిద్దరిని ప్రత్యేకంగా పూజించడానికి ఉండే కారణాల గురించి తెలుసుకుందాం. వినాయకుడిని ఆది దేవుడిగా భావించి, మనం పూజలు చేస్తూ ఉంటాము. ధర్మ మార్గంలో ఉన్న అడ్డంకులు అన్నింటినీ వినాయకుడు తొలగిస్తాడు.
మన పనికి ఏ విఘ్నం కలగకుండా చూస్తాడు. అందుకే, కచ్చితంగా గణపతిని పూజించాలి. శుభకార్యాలు జరపాలన్నా, దేనినైనా మొదలు పెట్టాలన్నా, పెళ్ళికి అయినా ముందు గణపతిని కొలుస్తాము. లక్ష్మీదేవిని చూసుకున్నట్లయితే, ఆమె సంపదకి అధిపతి. ధనం లేకుండా ఈ లోకం అనేది లేదు. అయితే, జీవితంలో ఏ అడ్డంకులు కలగకూడదని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటుంటారు. లక్ష్మీదేవి సంపద ఇస్తుంది.
వినాయకుడు అడ్డంకులు తొలగిస్తాడు. అందుకని, వీళ్ళిద్దరినీ కలిపి ఆరాధించడం మంచిది. అడ్డంకులన్నీ తొలగిపోయి, సంపద కలగాలని గణపతిని, లక్ష్మీదేవిని కలిపి పూజిస్తారు. పూర్వకాలంలో ఒకసారి ఒక సాధువు లక్ష్మీదేవిని పూజించడం మొదలుపెడతాడు. ఒకరోజు తనకి లక్ష్మీదేవి కనపడి గణపతిని అవమానించారని, ముందు వినాయకుడికి పూజ చేయాలని, లక్ష్మీదేవి చెప్తుంది. అప్పటినుండి ఆ సాధువు వినాయకుడి కోపం తగ్గించడానికి, వినాయక పూజని మొదలుపెడతాడు. తర్వాత వినాయకుడు ఆ సాధువు కోరికని తీరుస్తాడు. అలా వినాయకుడిని, లక్ష్మీదేవిని కలిపి పూజించడం మొదలైంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…