Beeruva : ఈరోజుల్లో డబ్బే అన్నింటికంటే ముఖ్యమైనదిగా మారిపోయింది. కొన్ని కొన్ని సార్లు డబ్బులు లేకపోతే బంధాలు కూడా ఉండడం లేదు. డబ్బులు ఉన్నప్పుడే బంధువులు కూడా వస్తూ ఉంటారు. డబ్బు లేకపోతే బంధువులు కూడా మనకి దూరం అవుతారు. మనిషి జీవితంలో ప్రేమ, అనుబంధాల తర్వాత డబ్బు ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే కొందరు మాత్రం డబ్బు సంపాదించడానికి ఎన్నో రకాల కష్టాలు పడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా కూడా డబ్బులు చేతికి రావు. పైగా డబ్బులు చేతికి వచ్చినా త్వరగా ఖర్చయిపోవడం, లేదంటే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవడం ఇలా ఏదో ఒకటి జరుగుతుంది.
ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కడానికి కష్టపడి పని చేయడంతోపాటు వీటిని పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. డబ్బు మీ ఇంట ఉంటుంది. మనం డబ్బులు దాచే బీరువాకి పొరపాటున అద్దం ఉంటే ఆర్థిక కష్టాలు ఎక్కువవుతాయి. సాధారణ బీరువాకి అద్దం ఉన్నప్పుడు మనం వెళ్లి అద్దం ముందు నిలబడి తయారవుతూ ఉంటాము. బీరువాలో సాక్షాత్తు అమ్మవారి స్వరూపమైన బంగారం, డబ్బులని పెడుతూ ఉంటాము. బయట అద్దం ముందు మనం తయారయ్యి నిలబడినప్పుడు, అమ్మవారికి కోపం వచ్చి, ఇంటి నుండి వెళ్ళిపోతుందని వాస్తు పండితులు అంటున్నారు.
కాబట్టి ఈ పొరపాటు లేకుండా చూసుకోండి. చీపురుతో ఇంటిని ఊడ్చేటప్పుడు బీరువా చుట్టూ ఊడ్చకూడదు. కేవలం తడిగుడ్డతో మాత్రమే బీరువా చుట్టుపక్కల తుడుచుకోవాలి. బీరువాలో పాత వస్తువులు, పాడైపోయిన వస్తువులు పెట్టకూడదు. పనికిరాని వాటిని బీరువాకి దూరంగా ఉంచుకోవాలి. బీరువాలో 6 పసుపు కొమ్ములు, 6 లక్ష్మీ గవ్వలు పెడితే అదృష్టం కలుగుతుంది. పచ్చ కర్పూరాన్ని కూడా పెట్టుకోవడం మంచిది.
బీరువా తలుపులు తెరిచి, తలుపులు వేయడం మర్చిపోతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. బీరువాకి యజమాని కాళ్లు తగిలితే అదృష్ట లక్ష్మి అనుగ్రహం పోతుంది. స్నానం చేయకుండా బీరువాని తెరవకూడదు. అలా చేయడం వలన ధన లాభం పొందే యోగం తగ్గిపోతుంది. చూశారు కదా వేటిని పాటించాలి వేటిని పాటించకూడదని.. మరి ఇలా అనుసరించి ఆర్థిక బాధల నుండి బయటపడండి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…