పొరపాటున కూడా ఈ మొక్కలను ఇంట్లో ఉంచకండి..!

August 13, 2021 1:26 PM

పొరపాటున కూడా ఈ మొక్కలను ఇంట్లో ఉంచకండి..!సాధారణంగా మనం మన ఇంటిని అందంగా అలంకరించుకోవడం కోసం వివిధ రకాల పూల మొక్కలను, లేదా అలంకరణ మొక్కలు తెచ్చి ఇంటి ఆవరణంలో నాటుతాము.ఈ విధంగా నాటడం వల్ల ఇంటికి ఎంతో అందం వస్తుందని చాలా మంది భావిస్తుంటారు.అయితే కొన్ని రకాల మొక్కలను మన ఇంటి ఆవరణంలో ఉంచడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల మొక్కలను పొరపాటున కూడా ఇంట్లో పెంచకూడదని, వాటిని పెంచడం వల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు.మరి ఇంట్లో ఎటువంటి మొక్కలను పెంచకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

మన ఇంటి ఆవరణంలో లేదా ఇంటికి ఎదురుగా చింత చెట్టును పెంచకూడదు. చింత చెట్టు మన ఇంటి అభివృద్ధిని నిరోధించడమేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య కలహాలను సృష్టిస్తుంది. అదేవిధంగా ముల్లు కలిగినటువంటి బ్రహ్మజెముడు వంటి మొక్కలను కూడా ఇంటి ఆవరణంలో పెంచకూడదు. ఇలాంటి మొక్కలు మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని ప్రసరింప చేస్తుంటాయి.

వెదురు మొక్కలను కూడా ఇంటి ఆవరణంలో పెంచకూడదు. వెదురు కట్టెలు సాధారణంగా చనిపోయిన వారిని దహనం చేయడానికి ఉపయోగిస్తాము. కనుక అలాంటి మొక్కలు ఇంట్లో ఉండటం అరిష్టమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన రావిచెట్టు మనకు వివిధ ఆలయాలలో దర్శనమిస్తుంది. అయితే ఈ రావిచెట్టు ఇంటి ఆవరణంలో ఉండకూడదని, ఇంటి ఆవరణంలో ఉండటంవల్ల మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందుకోసమే ఇంటి ఆవరణంలో రావిచెట్టును పెంచకూడదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment