ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా జీవించాలని అనుకుంటూ ఉంటారు. కానీ, చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటారు. ఆర్థిక సమస్యలు లేకుండా, నిత్యం లక్ష్మీదేవి కటాక్షం తో సుఖ సంతోషాలతో ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, ప్రతి ఒక్కరు కూడా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే, ఆ ఇంట్లో ఎలాంటి బాధ కూడా ఉండదు. సుఖ సంతోషాలతో ఉండవచ్చు.
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, చాలామంది ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా, శుక్రవారం నాడు, ఇంటిని ఎంతో అందంగా అలంకరించి పూజలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ, ఇంటి గడపకి పసుపు రాసి, పూలతో అలంకరిస్తారు. అలానే, చాలామంది, దేవుడి గదిలో పూలు, పండ్లు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. ఎన్నో మంత్రాలు, శ్లోకాలని కూడా చదువుతూ ఉంటారు. శుక్రవారం నాడు, లక్ష్మీదేవి ఎక్కడ వెళ్ళిపోతుందని ఎవరికీ డబ్బులు కూడా ఇవ్వరు. అయితే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
శంఖం శబ్దం వినిపించని చోట, లక్ష్మీదేవి ఉండదు. ప్రతి ఇంట్లో తులసి ఉండాలని ఎప్పటినుండో ఈ ఆచారం ఉంది. తులసిని పూజించని చోట, లక్ష్మీదేవి ఉండదట. అలానే, అతిధులకి భోజనాలు పెట్టని ఇంట్లో, లక్ష్మీదేవి నివసించదు. ఇల్లు కళకళలాడుతూ లేకపోతే లక్ష్మీదేవి ఉండదు. ఇంట్లో, పూజలు జరుగుతూ ఉండాలి.
ఇంటికి దీపం ఇల్లాలు. ఆమె ఎప్పుడూ కంటతడి పెట్టకూడదు. లక్ష్మీదేవి అలాంటి ఇంట్లో ఉంటుందట. చెట్లను నరికే వాళ్ళ ఇంట్లో, లక్ష్మీదేవి ఉండదు. సూర్యోదయం సమయంలో భోజనం చేసే వాళ్ళ ఇంట్లో, లక్ష్మీదేవి ఉండదు. తడి పాదాలతో నిద్రపోయే వాళ్ళ ఇంట కూడా, లక్ష్మీదేవి ఉండదు. తులసిని పూజించే చోట, శంఖం ధ్వని ఉండే చోట అష్టైశ్వర్యాలు కలుగుతాయిట.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…