Lord Surya : ఆర్థిక సమస్యలు ఉన్నాయా..? ఇలా ఆదివారం చేయండి.. దోషాలన్నీ పూర్తిగా పోతాయి..!

December 5, 2023 6:00 PM

Lord Surya : ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. కానీ, కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటారు. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే, ఇలా చేయడం మంచిది. ఇలా చేస్తే, ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు. ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు, ఆదివారం నాడు సూర్యుడిని ఆరాధించడం చాలా మంచిది. జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లు, సూర్యుడిని ఆరాధించాలి. ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు, ఆదివారం నాడు సూర్యుడిని పూజిస్తే, మంచి ఫలితాలు ఉంటాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. నవగ్రహాల్లో సూర్యుడిని అధిపతిగా, రాజుగా పరిగణించడం జరుగుతుంది. మొత్తం 12 రాశి చక్రాలలో సూర్యుడు సింహరాశిని పాలిస్తాడు. సూర్యుడు మేషరాశిలో ఉచ్ఛస్థితిలో ఉంటాడు. తులారాశిలో బలహీనమవుతాడు. సూర్యుడిని ఆరాధించడం వలన, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. జీవితంలో ఆనందంగా ఉండడానికి అవుతుంది.

do like this on Sunday for Lord Surya to remove problems
Lord Surya

కష్టపడి పనిచేసినా కూడా కొంతమందికి ఫలితాలు రావు. అటువంటి వాళ్ళకి సూర్యుడు బలహీన స్థానంలో ఉంటారు. సూర్యుడు బలహీనంగా ఉండడం వలన, ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువవుతుంది. హృదయ సంబంధిత సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోవడం వలన, సూర్య భగవానున్ని ప్రసన్నం చేసుకోవచ్చు. పారాయణం చేసి, సూర్యుడని ఆరాధించడం వలన, సూర్య భగవానుడు ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్లు, ఆదివారం రోజు రాగి పాత్రలు లేదంటే గోధుమలు దానం చేయడం మంచిది.

ఆదివారం రోజు సాయంత్రం, సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు దగ్గర, నాలుగు ముఖాలు కలిగిన దీపాన్ని వెలిగించాలి. అదేవిధంగా, ఆదివారం నాడు స్నానం చేసే నీటిలో, ఎర్రటి పూలు వేసుకొని స్నానం చేయాలి. ఎర్రచందనం, యాలకులు, కుంకుమపువ్వు వంటివి వేసుకుని స్నానం చేయడం వలన, సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. కుటుంబంలో కలహాలు తగ్గుతాయి. శనివారం నిద్రపోవడానికి ముందు తలపై ఆవుపాల సీసా పెట్టుకోవాలి. ఉదయాన్నే, తలస్నానం చేసి పూజ చేశాక, ఈ పాలని కూడా పూజించి, తర్వాత తీసుకోవాలి. ఇలా చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now