Bedi Anjaneya Swamy Temple : తిరుమల సన్నిధి వీధిలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఈ ఆంజనేయస్వామిని బేడీలతో బంధించారు. అయితే చాలామంది తిరుమల ఎన్నోసార్లు వెళ్లి ఉంటారు. కానీ ఈ బేడి ఆంజనేయస్వామి గురించి తెలియకపోయి ఉండొచ్చు. మరి ఈ ఆంజనేయస్వామిని ఎందుకు బేడీలతో బంధించారు, కారణం ఏంటి.. వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.
వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి అక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత ఇక్కడికి కూడా నైవేద్యాన్ని తీసుకువస్తారు. పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే హనుమంతుడు చిన్నతనంలో ఒంటెను వెతకడానికి తిరుమలని విడిచి పెట్టాలని అనుకుంటాడు. అతని తల్లి అంజనాదేవి ఆయన మణికట్టుకి బేడీలతో కట్టి ఆమె తిరిగి వచ్చేదాకా ఆ ప్రదేశంలో ఉండమని ఆదేశించిందని కొన్ని కథనాలు చెబుతున్నాయి. అంజనాదేవి ఆకాశగంగ ప్రాంతంలో ఉండిపోయింది. తిరిగి రాలేదని పురాణాల ప్రకారం తెలుస్తోంది.
ఈ ఆలయంలోని హనుమంతుని రెండు చేతులకి సంకెళ్లు వుంటాయి. ఇలా ఒక ప్రత్యేక ఆకృతిలో ఈ హనుమంతుడు వుంటాడు. ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. భక్తులు ఇక్కడికి వచ్చి వారి యొక్క కష్టాలని, కోరికల్ని చెప్పుకుంటే ఆ కోరికలు వెంటనే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇప్పటికీ ఆ ఆంజనేయస్వామి అక్కడే స్థిరపడి ఉన్నట్లు వైష్ణవ సంప్రదాయాల ప్రకారం ప్రధాన ఆలయానికి ఎదురుగా గరుడగా ఈయన వెలసినట్లు తెలుస్తోంది.
తిరుమలలో శ్రీ బేడి ఆంజనేయస్వామి.. వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఎదురుగా కనిపిస్తాడు. ప్రతి ఆదివారం కూడా శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అభిషేకాలని కూడా నిర్వహిస్తారు. ఈ బేడి ఆంజనేయస్వామి ఆలయంలో కూడా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుతారు. తిరుమలకి వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని మీరు చూడొచ్చు. వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఎదురుగా శ్రీ బేడి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. నడిచి వెళ్ళిపోవచ్చు. ఆలయం అఖిలాండం పక్కనే ఉంది. ప్రతిరోజు ఉదయం 5:30 నుండి రాత్రి 9 వరకు కూడా ఈ ఆలయం తెరచి ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…