Ayyappa Swamy : అయ్యప్ప మాల ధారణ ఎంతటి కఠోర నియమ, నిష్టలతో కూడుకుని ఉంటుందో అందరికీ తెలిసిందే. భక్తులు మాలను ధరించాక కనీసం 40 రోజుల పాటు దీక్షతో నియమాలను పాటిస్తూ రోజూ స్వామి వారికి పూజలు చేస్తారు. అనంతరం శబరిమల వెళ్లి స్వామివారి దర్శనం అయ్యాక మాలను తీసేస్తారు. అయితే శబరిమల మాత్రమే కాదు, అయ్యప్పస్వామిని మనం ఎక్కడ చూసినా, విగ్రహమైనా, చిత్రపటమైనా ఆయన పీఠంపై కూర్చుని ఉన్నప్పుడు ఆయన కాళ్లకు ఒక పట్టీ ఉంటుంది. అయితే ఆ పట్టీ ఎందుకు వచ్చిందో, అయ్యప్ప స్వామి ఆ పట్టీని ఎందుకు ధరిస్తాడో మీకు తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
అయ్యప్ప స్వామికి మణికంఠుడనే ఇంకో పేరుందని అందరికీ తెలిసిందే. అయితే అదే పేరుతో ఆయన పందళ రాజు వద్ద 12 సంవత్సరాలు పెరుగుతాడు. ఆ క్రమంలో తాను హరిహర సుతుడనని తెలుసుకుంటాడు. ధర్మాన్ని శాసించడం కోసం తాను జన్మించాననే విషయాన్ని నారద మహర్షి ద్వారా గ్రహిస్తాడు. అనంతరం మహిషిని అయ్యప్ప వధిస్తాడు. తరువాత శబరిమల ఆలయంలో జ్ఞాన పీఠంపై స్వామి కూర్చుంటాడు. అయితే అలా అయ్యప్ప స్వామి శబరిమలలో 18 మెట్ల పైన జ్ఞాన పీఠంపై కూర్చుని ఉన్నప్పుడు పందళ రాజు అయ్యప్ప కోసం వస్తాడు. ఈ క్రమంలో పందళరాజు 18 మెట్లు ఎక్కి అయ్యప్పను చేరుకునే సమయంలో అయ్యప్ప లేచి నిలబడేందుకు యత్నిస్తాడు. అయితే అప్పుడు అయ్యప్ప పట్టు తప్పి పడిపోబోతాడు. దీంతో పందళరాజు అది చూసి తన వద్ద ఉన్న పట్టు పట్టీని స్వామి వారి కాళ్లకు కడతాడు.
అనంతరం స్వామి పడిపోకుండా ఉంటాడు. దీంతో పందళరాజు స్వామిని ఎప్పటికీ ఆ పట్టీతోనే ఉండాలని కోరుతాడు. అందుకు అయ్యప్ప స్వామి అంగీకరించి పందళరాజుకు వరం ఇస్తాడు. అలా అయ్యప్ప ఇప్పటికీ మనకు కాళ్లకు పట్టీతోనే దర్శనమిస్తాడు. ఇదీ.. ఆయన పట్టీ వెనుక ఉన్న కథ..!
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…