Ashta Sidhi : యోగా శాస్త్రం ప్రకారం 8 సంఖ్యని మాయకి సంకేతంగా, అలాగే తొమ్మిది సంఖ్యని పరమాత్మకి ప్రతీకగా చెప్తూ ఉంటారు. భగవద్గీతలో అష్ట విధ మాయల ప్రస్తావన ఉంది. పంచభూతాలు మనసు, బుద్ధి, అహంకారం కలిస్తే, మనసు, బుద్ధి, అహంకారం, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఈ ఎనిమిదిని జయించిన వారికి కలిగే వాటిని అష్టసిద్ధులు అంటారు.
దత్త చరిత్రలో చూసుకున్నట్లయితే దత్తాత్రేయ మహా గురువులు అష్ట సిద్దులని బిడ్డలుగా ప్రస్తావించారు. ఆయన భక్తులకి అష్టసిద్ధుల అనుగ్రహం ఉంటుందని అభయమిచ్చారు. భగవానుని దివ్య ఆరాధనకి ఫలంగా భక్తులకు ప్రాప్తించే ఎనిమిది సిద్దులు అష్టసిద్ధులు. ఇదివరకు ఋషులు, యోగులు, మహర్షులు అష్టసిద్ధులని పొందారని పురాణాలు చెప్తున్నాయి.
ఆంజనేయస్వామి అష్టసిద్ధులు పొందాడు. అందుకే తులసీదాసు చాలీసాలో అష్టసిద్ధి నవనిధికే దాత అని స్తుతించడం జరిగింది. అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వం, వశిత్వం ఇవి ఎనిమిది కూడా అష్టసిద్ధులు. మరి ఇక ఎనిమిది గురించి వివరంగా తెలుసుకుందాం. సూక్ష్మావస్థలో కూడా భగవానుడు ఉన్నాడు అని నమ్మి మనసులో నిలుపుట వల్ల ఇది సిద్ధిస్తుంది. దీనివలన అత్యంత సూక్ష్మాణువుగా యోగి తనని మార్చుకోగలడు.
భగవంతుని మహత్తుని దర్శించగలిగిన సాధనకు మహిమ సిద్ధి వస్తుంది. గరిమ విషయానికి వస్తే శరీర బరువుని ఈ భూభారమునకు సమానంగా చేయగలరట. లఘిమ సిద్ధి కలవారు శరీరంని దూది కంటే తేలికగా ఉంచగలరు. ప్రాప్తి ద్వారా కావాలనుకున్న క్షణమునే శూన్యం నుండి కూడా సృజించుకోగలరు. ప్రాకామ్యము అంటే అనేక దివ్య శక్తులు, దూర శ్రవణం, ఆకాశగమనం వంటివి వారిలో ఉంటాయి. ఈశత్వం అంటే ఇంద్రాది దిక్పాలకుల్ని కూడా నియంత్రించగలిగినది. వశిత్వం అంటే సకల జీవ రాశుల వారు చెప్పినట్లుగా ప్రవర్తింప చేయగలిగే శక్తి. వీటినే అష్ట సిద్ధులని అంటారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…