అప్సరసలు ఎంతమంది.. వారి పేర్లు ఏమిటో తెలుసా?

February 26, 2023 5:31 PM

ప్రస్తుత కాలంలో అందం అనేది ఒక ముఖ్యమైన అంశంగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ అందం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అమ్మాయిల అందాలను దేవలోకంలో సౌందర్య తారలను వర్ణించి భావిస్తారు. స్వర్గలోకంలో దేవతల నాట్య మండలిలో నాట్యమాడుతూ అలరించేందుకు నియమించబడిన వారే ఈ అప్సరసలు. పురాణాల ప్రకారం అప్సరసలు దేవలోకంలో ఉండేవారని తెలుస్తోంది.

అప్సరసలు తమ సౌందర్యంతో ఎంతోమంది దీక్షలను భగ్నం చేసి ఎన్నో ప్రళయాలు జరగకుండా ఆపగలిగారు. అదేవిధంగా మరెంతో మంది మునులు తపస్సు భగ్నం కారణంగా శాపానికి గురైన వారు ఉన్నారు. ఎన్నో యుగాలు మారిన తమ అందం మాత్రం తగ్గని వారే ఈ అప్సరసలు. అప్సరసలు అంటే అందరికీ గుర్తొచ్చేది రంభ,ఊర్వశి, మేనక, తిలోత్తమలే మనకు గుర్తొస్తారు. నిజానికి అప్సరసలు 31 మంది.వీరిని ఏకత్రింశతి అప్సరసలు అని కూడా అంటారు. వారి పేర్లు ఇపుడు తెలుసుకుందాం…

రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమ, ఘృతాచి, సహజన్య మ్లోచ, వామన, మండోదరి, సుభోగ, విశ్వాచి, విపులానన, భద్రాంగి, చిత్రసేన, ప్రమోచన, ప్రమ్లోద, మనోహరి, మనో మోహిని, రామ, చిత్రమధ్య, శుభానన,సుకేశి, నీలకుంతల, మన్మదోద్ధపిని, అలంబుష, మిశ్రకేశి, పుంజికస్థల, క్రతుస్థల, వలాంగి, పరావతి, మహారూప, శశిరేఖ వంటి 31 మందిని అప్సరసలుగా పిలిచేవారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment