Annapurna Devi : అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం తినేటప్పుడు, వండేటప్పుడు కొన్ని రూల్స్ కచ్చితంగా పాటించాలి. అన్నాన్ని గౌరవించకపోతే అన్నం పుట్టదని పెద్దలు అంటూ ఉంటారు. ఇలా కనుక మీరు పాటించినట్లయితే ఎల్లప్పుడూ అన్నపూర్ణా దేవి మీ ఇంట్లో ఉంటుంది. మరి అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలిగి, అన్నపూర్ణా దేవి ఎల్లప్పుడూ ఇంట్లోనే ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం చూసినట్లయితే అన్నం వండుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎప్పుడైనా సరే అన్నం వండేటప్పుడు శారీరకంగా, మానసికంగా కూడా స్వచ్ఛంగా ఉంటూ వంట చేసుకోవాలి.
అలా స్వచ్ఛంగా వంట చేసుకోవడం వలన అన్నపూర్ణా దేవి ఇంట్లో ఉంటుంది. అలాగే హిందూ పురాణాల ప్రకారం చూసినట్లయితే ఎప్పుడూ కూడా మనం ఆహారాన్ని గౌరవించాలి. అన్నాన్ని తినేటప్పుడు కొన్ని మంత్రాలు లేదా శ్లోకాలని చదివి ఆ తర్వాత అన్నాన్ని తినడం మొదలు పెట్టాలి. ఒకసారి దేవుడిని స్మరించుకుని అన్నం తింటే మన ఇంట్లో అన్నపూర్ణా దేవి కొలువై ఉంటుంది. అన్నానికి లోటు ఉండదు.
ఎప్పుడూ కూడా వండిన అన్నాన్ని అవమానించకూడదు. ఎడమ చేతితో భోజనాన్ని తాకకూడదు, తినకూడదు. కుడి చేత్తోనే అన్నాన్ని తినాలి. వండేటప్పుడు ఎప్పుడూ కూడా తూర్పు వైపు నిలబడి వంట చేసుకోవాలి. తూర్పు వైపు కూర్చుని భోజనం తింటే చాలా మంచిది. అన్నపూర్ణా దేవి అనుగ్రహం కలగాలంటే అన్నాన్ని మనం దానం చేయాలి. మీ స్తోమతకి తగ్గట్టుగా దానం చేసినట్లయితే మీ ఇంట అన్నపూర్ణా దేవి కొలువై ఉంటుంది.
కొన్ని పక్షులకి లేదంటే జంతువులకి అయినా మీరు ఆహారాన్ని పెట్టొచ్చు. మంచం మీద కూర్చుని ఆహారాన్ని తీసుకోకూడదు. చేతులు కడుక్కోకుండా ఎప్పుడూ కూడా కంచంలో అన్నం పెట్టుకొని ఆ అన్నాన్ని పారేయకూడదు. అన్నం తినేటప్పుడు ఎప్పుడూ ప్రశాంతంగా కూర్చుని తినాలి తప్ప గొడవ పడుతూ తినకూడదు. ఇలా కచ్చితంగా మీరు వీటిని పాటించినట్లయితే అన్నపూర్ణా దేవి మీ ఇంట ఉంటుంది. డబ్బుకి, అన్నానికి లోటే ఉండదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…