సినిమాల్లో చూపించే సన్నివేశాలను కొందరు అనుకరించేందుకు యత్నిస్తుంటారు. అయితే కొన్ని ప్రమాదకరంగా ఉంటే కొన్ని మాత్రం రొమాంటిక్ సీన్లు ఉంటాయి. నిజ జీవితంలో వాటిని అనుకరించేందుకు కూడా చాలా మంది యత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు కూడా అలాగే చేశాడు. కాకపోతే అతను ఆ పని చేసినందుకు పోలీసులు అతని వెంట పడుతున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
బెల్లారి నుంచి బెంగళూరుకు ఓ యువతి అక్కడి కేఎస్‌ఆర్‌టీసీ లగ్జరీ బస్సులో ప్రయాణం అయింది. అయితే మార్గ మధ్యలో పీన్యా-జలహల్లి వద్ద బస్సు విరామం కోసం ఆగింది. ఆ సమయంలో ఆ యువతి నిద్ర పోతోంది. అదే అదునుగా భావించిన ఓ యువకుడు ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి వెంటనే పరారయ్యాడు.
విషయాన్ని గ్రహించిన ఆ యువతి వెంటనే మేల్కొని బయటకు పరిగెత్తింది. కానీ అప్పటికే ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. అతను బస్సు ఎక్కేటప్పుడు ఆ యువతి పక్కనే కూర్చున్నాడు. మార్గ మధ్యలో ప్రయాణంలో అతను తన వైపే తీక్షణంగా చూశాడని ఆ యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ యువకుడి కోసం వేట కొనసాగిస్తున్నారు. బస్సు ప్రయాణించిన రూట్లలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను వారు పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఆ యువకున్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…