ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కొందరు ఆ మాటలను పట్టించుకోవడం లేదు. దీంతో వారు మోసగాళ్ల బారిన పడుతున్నారు. పెద్ద ఎత్తున డబ్బు నష్టపోతున్నారు. బెంగళూరులో ఓ మహిళ కూడా సరిగ్గా ఇలాగే పెద్ద ఎత్తున డబ్బును పోగొట్టుకుంది. వివరాల్లోకి వెళితే…
బెంగళూరులోని వైట్ ఫీల్డ్‌లో నివాసం ఉండే ఆంచల్ ఖండేల్‌వాల్ అనే మహిళ మార్చి 24వ తేదీన గూగుల్ లో సెర్చ్ చేసి ఆన్‌లైన్‌లో వైన్ డెలివరీ ఇచ్చే వారి ఫోన్ నంబర్లను సేకరించింది. రణవీర్ సింగ్‌గా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తితో ఆమె ఫోన్‌లో మాట్లాడింది. తనకు ముందుగా కొంత మొత్తం అడ్వాన్స్ గా ఇవ్వాలని వెంటనే వైన్‌ను ఇంటికి డోర్ డెలివరీ చేస్తానని చెప్పాడు. దీంతో ఆమె నమ్మి అతనికి ఆన్‌లైన్‌లో డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది.
అయితే ఎన్నిసార్లు డబ్బు పంపినా అతను రాలేదని చెప్పాడు. దీంతో ఆమె అలా నగదును ట్రాన్స్‌ఫర్ చేస్తూనే వెళ్లింది. ఈ క్రమంలో ఆమె అతనికి మొత్తం రూ.1,59,595 పంపించింది. అయితే చివరకు తాను మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులకు వారం తరువాత ఫిర్యాదు చేసింది. అన్ని రోజులూ ఎందుకు వేచి ఉన్నావని అడిగితే డబ్బులు వెనక్కి ఇస్తారని ఆగానని చెప్పింది. కానీ అప్పుడే చెప్పి ఉంటే వారి అకౌంట్లను ఫ్రీజ్ చేసేవారమని, దీంతో డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం ఉండేదని, ఇప్పుడు కష్టమని పోలీసులు ఆమెకు చెప్పారు. అయినప్పటికీ వారు కేసు నమోదు చేసి నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…