ఆన్‌లైన్‌లో వైన్ ఆర్డ‌ర్ చేసింది.. రూ.1.60 ల‌క్ష‌లు పోగొట్టుకుంది..!

April 8, 2021 11:28 AM

ఆన్‌లైన్ మోసాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సైబ‌ర్ నిపుణులు, పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు ఆ మాట‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో వారు మోసగాళ్ల బారిన ప‌డుతున్నారు. పెద్ద ఎత్తున డబ్బు న‌ష్ట‌పోతున్నారు. బెంగ‌ళూరులో ఓ మ‌హిళ కూడా స‌రిగ్గా ఇలాగే పెద్ద ఎత్తున డ‌బ్బును పోగొట్టుకుంది. వివ‌రాల్లోకి వెళితే…

woman lost 1.60 lakhs in online fraud

బెంగ‌ళూరులోని వైట్ ఫీల్డ్‌లో నివాసం ఉండే ఆంచ‌ల్ ఖండేల్‌వాల్ అనే మ‌హిళ మార్చి 24వ తేదీన గూగుల్ లో సెర్చ్ చేసి ఆన్‌లైన్‌లో వైన్ డెలివ‌రీ ఇచ్చే వారి ఫోన్ నంబ‌ర్ల‌ను సేక‌రించింది. ర‌ణ‌వీర్ సింగ్‌గా ప‌రిచ‌యం చేసుకున్న ఓ వ్య‌క్తితో ఆమె ఫోన్‌లో మాట్లాడింది. త‌న‌కు ముందుగా కొంత మొత్తం అడ్వాన్స్ గా ఇవ్వాల‌ని వెంట‌నే వైన్‌ను ఇంటికి డోర్ డెలివ‌రీ చేస్తాన‌ని చెప్పాడు. దీంతో ఆమె న‌మ్మి అత‌నికి ఆన్‌లైన్‌లో డ‌బ్బును ట్రాన్స్‌ఫ‌ర్ చేసింది.

అయితే ఎన్నిసార్లు డ‌బ్బు పంపినా అత‌ను రాలేద‌ని చెప్పాడు. దీంతో ఆమె అలా న‌గ‌దును ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తూనే వెళ్లింది. ఈ క్ర‌మంలో ఆమె అత‌నికి మొత్తం రూ.1,59,595 పంపించింది. అయితే చివ‌ర‌కు తాను మోస‌పోయాన‌ని గ్ర‌హించిన ఆమె పోలీసుల‌కు వారం త‌రువాత ఫిర్యాదు చేసింది. అన్ని రోజులూ ఎందుకు వేచి ఉన్నావ‌ని అడిగితే డ‌బ్బులు వెన‌క్కి ఇస్తార‌ని ఆగాన‌ని చెప్పింది. కానీ అప్పుడే చెప్పి ఉంటే వారి అకౌంట్ల‌ను ఫ్రీజ్ చేసేవార‌మ‌ని, దీంతో డ‌బ్బులు వెన‌క్కి వ‌చ్చే అవ‌కాశం ఉండేద‌ని, ఇప్పుడు క‌ష్ట‌మ‌ని పోలీసులు ఆమెకు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ వారు కేసు న‌మోదు చేసి నిందితుల‌ను గుర్తించే ప‌నిలో ప‌డ్డారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment