స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వెళ్లింది.. విగతజీవిగా ఇంటికి వచ్చింది.. అసలేం జరిగింది?

August 4, 2021 8:25 AM

ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో చాలా మంది తమ స్నేహితులతో కలిసి రెస్టారెంట్లకు వెళ్లి బాగా ఎంజాయ్ చేసి వస్తుంటారు. ఈ క్రమంలోనే స్నేహితుల దినోత్సవం కావడంచేత స్నేహితులు అందరూ కలిసి ఎంతో సరదాగా పబ్ కి వెళ్లారు. పబ్ లో బాగా ఎంజాయ్ చేసి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురై అందులో ఆశ్రిత అనే యువతి మృతి చెందిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

woman died in road accident

తెల్లాపూర్‌ బొన్సాయ్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న డి.వినయ్‌కుమార్‌ ఎంఆర్‌ఎఫ్‌ సంస్థ ఉద్యోగి. అతని  కూతురు డి.ఆశ్రిత ఇక్ఫాయ్‌ బిజినెస్‌ స్కూల్‌లో గత ఏడాది బీబీఏ పూర్తి చేసి పై చదువుల కోసం కెనడా వెళ్ళింది. కెనడా నుంచి తిరిగి రావడంతో సరదాగా తన స్నేహితులతో కలిసి స్నేహితుల దినోత్సవం రోజు పబ్ కి వెళ్లి ఎంజాయ్ చేశారు.

ఈ విధంగా పబ్ నుంచి రాత్రి 11 గంటల సమయంలో తిరిగి వస్తుంటే కొండాపూర్‌లోని మైహోం మంగళ అపార్టుమెంట్స్‌ వద్ద కారు అదుపు తప్పి బండరాళ్లను ఢీకొట్టింది. ఈ క్రమంలోనే రోడ్డుపై ఎగిరి కింద పడటంతో ప్రాణాలను కోల్పోయింది. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. సరదాగా స్నేహితులతో గడుపుతానని చెప్పి వెళ్లిన కూతురు ఈ విధంగా విగతజీవిగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇంత పని చేసావ్.. ఏంటి దేవుడా.. అంటూ ఆ తల్లిదండ్రుల రోదన పలువురిని కంటతడి పెట్టించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment