దారుణం.. భర్త తనతో వాట్సాప్‌లో చాటింగ్‌ చేయడం లేదని అతని మూతి పళ్లు రాలగొట్టింది..

సెప్టెంబర్ 24, 2021 8:07 సా.

భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు, మనస్ఫర్థలు వస్తుండడం సహజమే. అయితే అవి అపార్థాలకు దారి తీయకూడదు. కొన్ని సంఘటనలు మాత్రం దంపతుల మధ్య విపరీతమైన పరిస్థితులకు దారి తీస్తాయి. సరిగ్గా అక్కడ కూడా ఇలాగే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..

దారుణం.. భర్త తనతో వాట్సాప్‌లో చాటింగ్‌ చేయడం లేదని అతని మూతి పళ్లు రాలగొట్టింది..

హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని షిమ్లాకు సమీపంలో ఉన్న థియోగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఛాయిలా అనే ప్రాంతంలో ఓ మహిళ తన భర్తతో గొడవపడింది. అతను ఆమెతో వాట్సాప్‌లో చాటింగ్‌ చేయడం లేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే ఆ మహిళ మాత్రం పట్టరాని కోపంతో, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తన భర్త మూతిపై పిడి గుద్దులు గుద్దింది. దీంతో అతని మూతి పళ్లు రాలాయి.

కాగా ఆ వ్యక్తి తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్లు 341, 323, 506 ల కింద కేసు నమోదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కోర్టులో ప్రవేశపెడతామని షిమ్లా ఎస్పీ మౌనిక తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment