సాధారణంగా ఏ తల్లి అయినా తనకు ఎంతటి కష్టం వచ్చినా తన బిడ్డల ఆలనాపాలనా చూస్తూ ఆ కష్టాన్ని మరిచిపోయి బిడ్డలకోసం బతుకుతుంది. కడుపు తీపిని చంపుకోలేక తన బిడ్డలకు ఏమాత్రం కష్టం రాకుండా తల్లి అన్ని బాధలను తన కడుపులో దాచుకొని తన బిడ్డలను పెంచుతుంది. కానీ ఈ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో కానీ.. ఏకంగా తన ముగ్గురు బిడ్డల ప్రాణాలు తీసి, తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
వేలూరులోని తోటపాళ్యంలో దినేష్, జీవిత అనే దంపతులు నివసిస్తున్నారు. దినేష్ టైల్స్ అతికించే పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడు. వీరికి అక్షయ్, నందన్ కుమార్, మరో ఆరు నెలల చిన్నారి ఉన్నారు. ఇలా టైల్స్ అతికిస్తూ దినేష్ జీవనం కొనసాగిస్తున్నప్పటికీ రోజూ మద్యం సేవించి జీవితతో గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే అతనితో గొడవపడి పుట్టింటికి వెళ్ళిన జీవిత గురువారం తన భర్త దగ్గరికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది.
ఈ క్రమంలోనే దినేష్ ఉదయం 7 గంటలకే పనికి వెళ్లడంతో తన తల్లి జీవితకి ఫోన్ చేసింది. ఇలా ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయకపోవడంతో అనుమానం వచ్చిన ఆ తల్లి తన కుమారుడు జగదీష్ కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి ఇంటికి వెళ్లి చూడమని చెప్పింది. జగదీష్ ఇంటికి వెళ్లగా తలుపు లోపల గడియ పెట్టడంతో డోర్ తీయడానికి ప్రయత్నించాడు. అయితే జగదీష్ చివరికి డోర్ తీసి చూడగా తన అక్క, ముగ్గురు పిల్లలు విగతజీవులుగా పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తన అక్క, పిల్లలు చనిపోవడానికి కారణం ఆమె భర్త అని, ఈతను రోజూ తాగొచ్చి ఆమెను చిత్రహింసలకు గురి చేయడం వల్లే మానసికంగా కృంగిపోయి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…