ఈ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో పాపం.. ముగ్గురు పిల్లలను చంపి, తాను కూడా ఆత్మహత్య..!

సెప్టెంబర్ 25, 2021 10:18 సా.

సాధారణంగా ఏ తల్లి అయినా తనకు ఎంతటి కష్టం వచ్చినా తన బిడ్డల ఆలనాపాలనా చూస్తూ ఆ కష్టాన్ని మరిచిపోయి బిడ్డలకోసం బతుకుతుంది. కడుపు తీపిని చంపుకోలేక తన బిడ్డలకు ఏమాత్రం కష్టం రాకుండా తల్లి అన్ని బాధలను తన కడుపులో దాచుకొని తన బిడ్డలను పెంచుతుంది. కానీ ఈ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో కానీ.. ఏకంగా తన ముగ్గురు బిడ్డల ప్రాణాలు తీసి, తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో పాపం.. ముగ్గురు పిల్లలను చంపి, తాను కూడా ఆత్మహత్య..!

వేలూరులోని తోటపాళ్యంలో దినేష్, జీవిత అనే దంపతులు నివసిస్తున్నారు. దినేష్ టైల్స్ అతికించే పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడు. వీరికి అక్షయ్, నందన్ కుమార్, మరో ఆరు నెలల చిన్నారి ఉన్నారు. ఇలా టైల్స్ అతికిస్తూ దినేష్ జీవనం కొనసాగిస్తున్నప్పటికీ రోజూ మద్యం సేవించి జీవితతో గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే అతనితో గొడవపడి పుట్టింటికి వెళ్ళిన జీవిత గురువారం తన భర్త దగ్గరికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది.

ఈ క్రమంలోనే దినేష్ ఉదయం 7 గంటలకే పనికి వెళ్లడంతో తన తల్లి జీవితకి ఫోన్ చేసింది. ఇలా ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయకపోవడంతో అనుమానం వచ్చిన ఆ తల్లి తన కుమారుడు జగదీష్ కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి ఇంటికి వెళ్లి చూడమని చెప్పింది. జగదీష్ ఇంటికి వెళ్లగా తలుపు లోపల గడియ పెట్టడంతో డోర్‌ తీయడానికి ప్రయత్నించాడు. అయితే జగదీష్‌ చివరికి డోర్ తీసి చూడగా తన అక్క, ముగ్గురు పిల్లలు విగతజీవులుగా పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తన అక్క, పిల్లలు చనిపోవడానికి కారణం ఆమె భర్త అని, ఈతను రోజూ తాగొచ్చి ఆమెను చిత్రహింసలకు గురి చేయడం వల్లే మానసికంగా కృంగిపోయి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment