ఫోన్ లో గేమ్ ఆడటం కోసం తమ్ముడితో గొడవ పడిన అక్క.. చివరకు విషాదాంతం..

September 17, 2021 12:30 PM

ప్రస్తుత కాలంలో పుట్టిన పిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ కు బానిసలవుతున్నారు. ఒక నిమిషం చేతిలో సెల్ లేకపోతే ఏ మాత్రం దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కరోనా వల్ల చాలా మంది పిల్లలు సెల్ ఫోన్లకి మరింత ఎక్కువగా బానిసలు అయ్యారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఒకే సెల్ ఫోన్ కోసం అక్క, తమ్ముడు పోట్లాడుతున్న సమయంలో తల్లిదండ్రులు తమ కూతురిని వారించారు. దీంతో ఆ బాలిక మానసిక వేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఫోన్ లో గేమ్ ఆడటం కోసం తమ్ముడితో గొడవ పడిన అక్క.. చివరకు విషాదాంతం..

మహారాష్ట్ర ముంబైలోని కాందివలి తూర్పు జనపౌడలో బాధిత కుటుంబం నివాసముంటోంది. ఈ క్రమంలోనే 16 సంవత్సరాల బాలిక సెల్ ఫోన్ లో గేమ్ ఆడుతూ కూర్చుంది. అదే సమయంలో తన సోదరుడు కూడా అదే ఫోన్ లో గేమ్ ఆడాలని భావించి సెల్ ఫోన్ కోసం గొడవ పడ్డారు. ఈ విధంగా వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో తన తల్లి వచ్చి కూతురిని వారించింది. దీంతో ఆ బాలిక ఎంతో మానసిక వేదనకు గురైంది.

ఈ క్రమంలోనే దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ కి వెళ్లి ఎలుకల మందు కొనుగోలు చేసి.. తన తల్లిదండ్రులు తనను తిట్టారన్న కోపంతో ఎలుకల మందును తిన్నది. ఆరోజు రాత్రి తమ కూతురు పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండడంతో వెంటనే తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విధంగా చికిత్స తీసుకుంటున్న బాలిక ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మరుసటి రోజు మృతి చెందింది. దీంతో ఆమె కుటంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అలా ఒక సెల్‌ఫోన్‌ ఆ బాలిక ప్రాణాలు తీసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment