భార్య భర్తల గొడవలోకి దూరాడు.. దారుణంగా హత్యకు గురయ్యాడు..!

September 13, 2021 7:38 PM

భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు మనస్పర్ధలు రావడం సర్వసాధారణం. అయితే భార్య భర్తల మధ్య జరిగే గొడవలలో మూడవ వ్యక్తి కల్పించుకోకపోవడం ఎంతో మంచిది. కొన్ని రోజుల పాటు ఎడమొహం పెడమొహంగా ఉన్న తర్వాత భార్య భర్తలు ఇద్దరూ ఒకటవుతారు. అయితే తన కూతురు అల్లుడు గొడవ పడ్డారని వారికి సర్ది చెప్పడానికి వెళ్ళిన మామ దారుణంగా హత్యకు గురైన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

భార్య భర్తల గొడవలోకి దూరాడు.. దారుణంగా హత్యకు గురయ్యాడు..!

షేక్‌ హఫీజ్‌ (47) సుభాష్‌చంద్రబోస్‌నగర్‌లో ఉంటూ క్యాబ్‌డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తన కూతురును ఆదిత్య నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ ఉమర్ కి ఆరు సంవత్సరాల క్రితం ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తడంతో పెద్దలు జోక్యం చేసుకుని సర్ది చెప్పేవారు. ఈ విధంగా ఆదివారం సాయంత్రం వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకొని గొడవకు దారి తీశాయి.

ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో తన కూతురికి, అల్లుడికి నచ్చజెప్పడానికి వెళ్ళిన హఫీజ్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉండగా తన అల్లుడు ఉమర్ కత్తి తీసుకుని తన మామ మెడపై దాడి చేయడంతో హఫీజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆ సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment