వైవాహిక జీవితంలో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య దూరం వచ్చేందుకు అస‌లు కార‌ణాలు ఇవే..!

April 22, 2023 1:38 PM

ప్రస్తుత సమాజంలో చాలామంది జంటలు పెళ్లి చేసుకొని మూన్నాళ్ళయినా కాకముందే విడిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే అపార్థాలు చేసుకొని జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. భార్యాభర్తల మ‌ధ్య ఇలాంటి సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం ఏంటో చాణక్యుడు తన నీతి శాస్త్రంలో బోధించాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికి ఒకరు అబద్ధాలు చెప్పుకుంటే వారి వివాహ జీవితంలో చీలిక ఏర్పడే అవకాశం ఉంటుందని చాణిక్యుడు చెప్పాడు. ఈ విధంగా చేయడం వల్ల జీవిత భాగస్వామిపై నమ్మకం పోతుందని, అనుమానం పెరిగి అది వారి సంబంధంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంద‌ని చెప్పాడు.

కోపంతో ఉన్న వ్యక్తిని మరింత కోపం పెరిగేలా చేయడం కూడా భార్య భర్తల మధ్య సంబంధాన్ని చెడగొడుతుంది. దీని వల్ల ఇతరులకు హాని కలిగే నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అందువ‌ల్ల కోపం ప‌నికిరాదు. భార్య భర్తలు అన్నాక కొన్ని విషయాలలో పరిధి ఉంటుంది. ఈ క్రమంలో ఎవరి రహస్యాలు వారి దగ్గరే ఉండాలి. ఇలాంటి రహస్య విషయాలను మరొకరితో పంచుకుంటే అవి మీ జీవిత భాగస్వామిని బాధపెడతాయి. అప్పుడు మీ సంబంధం బలహీనపడి తగాదాలకు దారి తీస్తుంది.

5 reasons why wife and husband get divorce

భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి తప్ప కించపరచుకోకూడదు. ఇలా చేయడం వల్ల చిన్న విషయాలు పెద్దగా అయిపోయి గొడవ ఏర్పడి ఈ బంధంపై ప్రభావం పడుతుంది. ఇద్దరు భార్య భర్తలు ఎప్పుడూ ప్రేమానురాగాలతో జీవించాలి. ఈ దంపతుల మధ్య మూడో వ్యక్తి ప్రవేశిస్తే మాత్రం మీ బంధం ఎక్కువ కాలం కొనసాగదని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో తెలియజేశాడు. క‌నుక ఈ కార‌ణాల‌ను తెలిసి అర్థం చేసుకుంటే దంప‌తులు త‌మ మ‌ధ్య దూరం రాకుండా చూసుకోవ‌చ్చు. దీంతో వారు విడిపోకుండా ఉంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now