Potatoes : ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ అనే ప్రాంతంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ రైతు నుంచి ఆలుగడ్డలను లంచంగా డిమాండ్ చేసినందుకు గాను ఓ పోలీస్ ఎస్ఐని ఆ ఏరియా ఎస్‌పీ సస్పెండ్ చేశారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. సదరు ఎస్ఐ కోడ్ భాషలో ఆలుగడ్డలు అనే పదాన్ని ఉపయోగించాడట. దీంతో అసలు విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆ ఎస్ఐని సస్పెండ్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ అనే ప్రాంతంలో ఉన్న సౌరిఖ్ అనే పోలీస్ స్టేషన్ పరిధిలో భవల్‌పూర్ చపున్న చౌకీ అనే ఏరియాకు గాను రామ్ క్రుపాల్ అనే వ్యక్తి పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఓ పని నిమిత్తం అతను ఓ రైతు నుంచి 5 కేజీల ఆలుగడ్డలను లంచంగా డిమాండ్ చేశాడు. కానీ తాను అంత ఇచ్చుకోలేనని, 2 కేజీలు మాత్రమే ఇవ్వగలనని చెప్పాడు. అయితే చివరకు 3 కేజీలకు బేరం కుదిరింది. కానీ ఇక్కడ ఆలుగడ్డలు అనేది కోడ్ భాష కావడం విశేషం. సదరు ఎస్ఐ తనకు కావల్సిన లంచాన్ని డబ్బుగా అడగకుండా చాలా తెలివిగా ఆలుగడ్డల రూపంలో కోడ్ భాష వాడి డబ్బు డిమాండ్ చేయడం విశేషం.
అయితే ఆ ఎస్ఐ కాల్ రికార్డ్ చేసి వైరల్ చేయడంతో విషయం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వెంటనే కన్నౌజ్ ఎస్‌పీ అమిత్ కుమార్ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్ఐ రామ్ కృపాల్ ను సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై తదుపరి విచారణకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆలుగడ్డలు అనే కోడ్ భాష వాడి రైతు నుంచి ఎస్ఐ లంచం డిమాండ్ చేయాలని చూశాడని, అందుకనే అతన్ని సస్పెండ్ చేశామని, డిపార్ట్‌మెంటల్ ప్రొసీజర్ ప్రకారం రామ్ క్రుపాల్‌పై విచారణ జరుగుతుందని ఎస్‌పీ అమిత్ కుమార్ ఆనంద్ తెలియజేశారు. కాగా కన్నౌజ్‌కు చెందిన సర్కిల్ అధికారి కమలేష్ కుమార్‌కు ఈ కేసు విచారణ బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…