Potatoes : రైతు నుంచి 5 కేజీల ఆలుగ‌డ్డ‌ల‌ను లంచంగా డిమాండ్ చేసిన పోలీస్ ఎస్ఐ.. స‌స్పెండ్ చేసిన ఎస్పీ..

January 15, 2026 9:13 PM

Potatoes : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని క‌న్నౌజ్ అనే ప్రాంతంలో విచిత్ర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ రైతు నుంచి ఆలుగ‌డ్డ‌ల‌ను లంచంగా డిమాండ్ చేసినందుకు గాను ఓ పోలీస్ ఎస్ఐని ఆ ఏరియా ఎస్‌పీ సస్పెండ్ చేశారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. స‌ద‌రు ఎస్ఐ కోడ్ భాష‌లో ఆలుగ‌డ్డ‌లు అనే ప‌దాన్ని ఉప‌యోగించాడ‌ట‌. దీంతో అస‌లు విష‌యం తెలుసుకున్న ఉన్న‌తాధికారులు ఆ ఎస్ఐని స‌స్పెండ్ చేశారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాల్లోకి వెళితే..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని క‌న్నౌజ్ అనే ప్రాంతంలో ఉన్న సౌరిఖ్ అనే పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో భ‌వ‌ల్‌పూర్ చ‌పున్న చౌకీ అనే ఏరియాకు గాను రామ్ క్రుపాల్ అనే వ్య‌క్తి పోలీస్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. అయితే ఓ ప‌ని నిమిత్తం అత‌ను ఓ రైతు నుంచి 5 కేజీల ఆలుగ‌డ్డ‌ల‌ను లంచంగా డిమాండ్ చేశాడు. కానీ తాను అంత ఇచ్చుకోలేన‌ని, 2 కేజీలు మాత్ర‌మే ఇవ్వ‌గ‌ల‌న‌ని చెప్పాడు. అయితే చివ‌ర‌కు 3 కేజీల‌కు బేరం కుదిరింది. కానీ ఇక్క‌డ ఆలుగ‌డ్డ‌లు అనేది కోడ్ భాష కావ‌డం విశేషం. స‌ద‌రు ఎస్ఐ త‌న‌కు కావ‌ల్సిన లంచాన్ని డ‌బ్బుగా అడ‌గ‌కుండా చాలా తెలివిగా ఆలుగ‌డ్డ‌ల రూపంలో కోడ్ భాష వాడి డ‌బ్బు డిమాండ్ చేయ‌డం విశేషం.

si suspended from department after he demanded 5kg of Potatoes as bribe from farmer
Potatoes

అయితే ఆ ఎస్ఐ కాల్ రికార్డ్ చేసి వైర‌ల్ చేయ‌డంతో విష‌యం తెలుసుకున్న పోలీస్ ఉన్న‌తాధికారులు విచార‌ణ చేప‌ట్టారు. వెంట‌నే క‌న్నౌజ్ ఎస్‌పీ అమిత్ కుమార్ ఆనంద్‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఎస్ఐ రామ్ కృపాల్ ను స‌స్పెండ్ చేశారు. ఈ సంఘ‌ట‌న‌పై త‌దుప‌రి విచార‌ణ‌కు ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆలుగ‌డ్డ‌లు అనే కోడ్ భాష వాడి రైతు నుంచి ఎస్ఐ లంచం డిమాండ్ చేయాల‌ని చూశాడ‌ని, అందుక‌నే అత‌న్ని స‌స్పెండ్ చేశామ‌ని, డిపార్ట్‌మెంటల్ ప్రొసీజ‌ర్ ప్ర‌కారం రామ్ క్రుపాల్‌పై విచార‌ణ జ‌రుగుతుంద‌ని ఎస్‌పీ అమిత్ కుమార్ ఆనంద్ తెలియ‌జేశారు. కాగా క‌న్నౌజ్‌కు చెందిన స‌ర్కిల్ అధికారి క‌మ‌లేష్ కుమార్‌కు ఈ కేసు విచార‌ణ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించిన‌ట్లు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now