Sai Dharam Tej : సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదం వెనుక ఉన్న కారణం అదే.. వెల్లడించిన పోలీసులు.. సీసీటీవీ దృశ్యాలు..

September 11, 2021 10:57 AM

Sai Dharam Tej : మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో గాయాల బారిన పడిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి మాదాపూర్‌లోని తీగల వంతెన మీద నుంచి ఐకియా వైపు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్పోర్ట్స్‌ బైక్‌ మీద వెళ్తుండగా సడెన్‌గా బైక్‌ అదుపు తప్పి రోడ్డు మీద స్కిడ్‌ అయింది. దీంతో సాయి ధరమ్‌ తేజ్‌కు గాయాలయ్యాయి.

Sai Dharam Tej : సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదం వెనుక ఉన్న కారణం అదే.. వెల్లడించిన పోలీసులు.. సీసీటీవీ దృశ్యాలు..

అయితే ఈ సంఘటన ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు వివరాలను వెల్లడించారు. వర్షం కారణంగా రోడ్డు తడిగా ఉండడంతోపాటు ఆ సమయంలో రోడ్డు మీద ఇసుక ఉందని, దీంతో బైక్‌ స్కిడ్ అయిందని, అందుకనే ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. సాయిధరమ్‌ తేజ్‌ వాహనాన్ని అదుపు చేయలేకపోయారని అందువల్లే కింద పడిపోయారని అన్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో సాయిధరమ్‌ తేజ్‌ మద్యం సేవించలేదని, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. కాగా ఆ ప్రమాదం సైబరాబాద్‌ కమిషనరేట్‌ లోని రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఐకియా స్టోర్‌ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సాయిధరమ్‌ తేజ్‌ కుడి కంటి పైభాగంతోపాటు ఛాతిలో గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయనకు అపోలో హాస్పిటల్‌లో చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్సను అందిస్తున్నామని, మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో ఉంచుతారని తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment