పక్కింటి పిల్లడు అల్లరి చేస్తున్నాడని ఆగ్రహించిన ఓ పోలీస్ ఆ బాలుడి పట్ల ఎంతో కఠినంగా ప్రవర్తించాడు. అతని అల్లరిని భరించలేక పోలీస్ అధికారి కత్తి తీసుకుని బాలుడిపై విసరడంతో ఆ కత్తి పిల్లాడి ఎడమ కన్నుకి గుచ్చుకొని తీవ్ర రక్తస్రావమైన ఘటన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.
స్థానిక బ్రాడీపేట ప్రైవేటు ఆసుపత్రుల వీధిలో రాయవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన నల్లమోతు వాణి, తన తల్లి, తన కుమారుడితో కలిసి నివాసముంటున్నారు. ఆ ఇంటి పై అంతస్తులోనే విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రామానికి చెందిన డి రాము రామచంద్రాపురం సబ్ జైల్ హెడ్ క్వార్టర్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వాణి మూడేళ్ల కుమారుడు ధన సిద్దేశ్వర్ ఆడుకోవడానికి ఇంటి పై అంతస్తుకు వెళ్లే వాడు.
ఈ విధంగానే ఈ నెల 24వ తేదీ చిన్నారికి సెల్ఫోన్ గేమ్ ఆడిస్తా అంటూ పైకి తీసుకెళ్ళిన రాము కొద్దిసేపటికి ఆ పిల్లాడు అల్లరి చేస్తున్నాడని,తన చేతిలో ఉన్న కత్తిని పిల్లాడి వైపు విసిరాడు.ఆ కత్తి బాలుడు ఎడమకన్నుకి గుచ్చుకొని తీవ్ర రక్తస్రావమైంది. ఈ క్రమంలోనే బాలుడు గట్టిగా అరవడంతో ఏమైందోనని హుటాహుటిన పైకి వెళ్ళిన వాణి తన కొడుకును చూడగానే కంట్లో నుంచి రక్తం కారడం వెంటనే వేమగిరి ఆస్పత్రికి తరలించగా.. వైద్యుల సూచన మేరకు విశాఖపట్నంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.బాలుడిని పరీక్షించిన వైద్యులు కంటిలో నరాలు దెబ్బతినడం వల్ల అతడికి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే చిన్న పిల్లాడు అని చూడకుండా పిల్లాడు పై కత్తి విసరడంతో వాని రాము పై రామచంద్రపురం సీఐ శ్రీనివాస్ కి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…