కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడం వల్ల ఇళ్లలోనే ఉంటున్న చాలా మంది ఈ-కామర్స్ సైట్లలో అన్ని వస్తువులను ఆర్డర్ చేస్తున్నారు. కిరాణా సరుకులు, ఎలక్ట్రానిక్స్ తదితర అనేక వస్తువులను ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేస్తున్నారు. దీంతో కావల్సిన వస్తువులు ఇంటికే డెలివరీ అవుతున్నాయి.
అయితే క్యాష్ ఆన్ డెలివరీ పద్దతిలోనూ వస్తువులను కొనుగోలు చేసే సదుపాయాన్ని ఈ-కామర్స్ సంస్థలు అందిస్తున్నాయి. దీంతో వినియోగదారులు ఇంటి వద్దే నగదు ఇచ్చి తమ వస్తువులను తీసుకోవచ్చు. అయితే కరోనా కారణంగా నగదు ఇవ్వడం రిస్క్‌తో కూడుకున్న పని. కనుక ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ సమస్యను పరిష్కరించేందుకు కొత్త పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో పేమెంట్లు సులభంగా నగదు చెల్లించవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకుంటే వినియోగదారులకు చెందిన వస్తువు ప్యాకేజీపై క్యూ ఆర్ కోడ్‌ను ప్రింట్ చేస్తారు. డెలివరీ సమయంలో ఆ క్యూఆర్ కోడ్‌ను యూపీఐ యాప్‌లతో స్కాన్ చేసి పేమెంట్లు చేయవచ్చు. దీంతో సురక్షితంగా పేమెంట్లు చేసేందుకు అవకాశం ఉంటుంది. కోవిడ్ రిస్క్ తగ్గుతుంది. దీన్నే క్యూఆర్ కోడ్ ఆధారిత పే-ఆన్-డెలివరీ పద్ధతిగా ఫ్లిప్ కార్ట్ పేర్కొంటోంది. ఇది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకునే వారికి ఉపయోగపడుతుందని ఫ్లిప్‌కార్ట్ తెలియజేసింది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…