క్రైమ్‌

ఎరుపు రంగు కొండ చిలువ‌.. భారీ ధ‌ర‌కు అమ్మ‌బోయి అరెస్ట‌య్యారు..

కొన్ని ర‌కాల ప్ర‌త్యేక‌మైన పాములను ఇంట్లో ఉంచుకున్నా, వాటికి పూజ‌లు చేసినా అదృష్టం, ధ‌నం క‌ల‌సి వ‌స్తాయ‌ని ఇప్ప‌టికీ కొంద‌రు న‌మ్మేవారు ఉన్నారు. అలాంటి వారినే ల‌క్ష్యంగా చేసుకుని కొందరు అరుదైన జాతికి చెందిన పాముల‌ను స్మ‌గ్లింగ్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని దుధ్వా అట‌వీ ప్రాంతంలో ఎరుపు రంగులో ఉండే కొండ చిలువ‌ను స్మ‌గ్లింగ్ చేస్తున్న న‌లుగురు వ్య‌క్తుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆ పామును స్వాధీనం చేసుకుని అట‌వీ శాఖ అధికారుల‌కు అప్ప‌గించారు. ఆ వ్య‌క్తుల‌ను పోలీసులు శాలు క‌శ్య‌ప్, ముకేష్ క‌శ్య‌ప్‌, సందీప్ సింఘాల‌లుగా గుర్తించారు. వీరికి అఫ్స‌ర్ అనే డ్రైవ‌ర్ స‌హ‌కారం అందించాడు. వారు ఆ పామును ఓ కారులో స్మ‌గ్లింగ్ చేస్తుండ‌గా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుని అరెస్టు చేశారు.

వారంద‌రూ ఢిల్లీకి చెందిన వారు కాగా దుధ్వా అట‌వీ ప్రాంతానికి స‌మీపంలో ఉన్న ఖెరి అనే గ్రామంలో వారు ఆ పామును స్థానికంగా ఉన్న ఓ వ్య‌క్తి నుంచి రూ.10 ల‌క్ష‌ల‌కు కొన్నారు. దాన్ని ముంబైలో రూ.50 ల‌క్ష‌ల‌కు అమ్మాల‌ని నిర్ణయించుకున్నారు. ఈ క్ర‌మంలోనే వారు పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు.

కాగా ఎరుపు రంగులో ఉండే ఆ కొండ చిలువ తోక కూడా త‌ల‌లాగే ఉంటుంది. దీంతో దాన్ని మొద‌టి సారి చూస్తే దానికి రెండు త‌ల‌లు ఉన్నాయేమోన‌ని ఎవ‌రైనా సరే అనుకుంటారు. ఇక ఈ పాముల‌కు చైనాతోపాటు ప‌లు ఆసియా దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని ఇంట్లో పెట్టుకుంటే ధ‌నవంతులు అవుతార‌ని కొంద‌రు ఇప్ప‌టికీ విశ్వ‌సిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM