కొడుకు ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం..!

August 14, 2021 8:30 PM

కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లికి కామంతో కళ్లు మూసుకుపోయి ఏకంగా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డపట్ల ఎంతో దారుణంగా ప్రవర్తించింది. ఈ క్రమంలోనే తరుచూ తన వివాహేతర బంధానికి తన కొడుకు అడ్డుగా వస్తున్నాడని భావించిన తల్లి అభంశుభం తెలియని ఆ చిన్నారి పట్ల కర్కశంగా ప్రవర్తించి చిన్నారిని చంపిన ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

గుజరాత్ అహ్మదాబాద్ జ్యోతి అజయ్ అనే దంపతులకు మూడు సంవత్సరాల కొడుకు ఉన్నాడు. అయితే జ్యోతి భరత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే కూరగాయలు తీసుకురావడానికి అని తన కొడుకును తీసుకుని ఇంటినుంచి బయటకు వెళ్ళిన జ్యోతి కూరగాయలు కొనకుండా ఒక ఫామ్ హౌస్ కి వెళ్ళింది. అక్కడ తన ప్రియుడు భరత్ తో కలిసి ఏకాంతంగా గడుపుతున్న సమయంలో పిల్లాడు ఏడవడంతో ఎంతో చికాకు పడ్డాడు. ఎప్పుడు ఏంటి నసా మనిద్దరి మధ్య అంటూ విసుక్కోవడంతో జ్యోతి కూడా తన కొడుకు పట్ల ఎంతో అసహనం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి ఆ చిన్నారిని చంపేయాలని ప్లాన్ చేశారు. అప్పుడే జ్యోతి పాలలో పురుగుమందు కలిపి బాబుకు పట్టించడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అనంతరం కూరగాయలు తీసుకొని జ్యోతి ఇంటికి వెళ్లి బాబును పడుకోబెట్టి తన పనిలో నిమగ్నమైంది. అంతలో తన మనవడితో ఆడుకోవడం కోసం వచ్చిన తాత ఆ బాలుడు అపస్మారక స్థితిలో ఉండటం గమనించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.అయితే అప్పటికే అతను మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు.దీంతో పోస్ట్ మార్టం నిర్వహించగా పిల్లాడి కడుపులో పురుగుల మందు అవశేషాలు కనిపించడంతో పోలీసులు తల్లిని కస్టడీలోకి తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు పరారీలో ఉండగా పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment