దారుణం.. పుట్టింటికి వెళ్తాన‌ని అడిగిన భార్య‌.. కిరోసిన్ పోసి నిప్పు పెట్టిన భ‌ర్త‌..

September 2, 2021 5:06 PM

మ‌హిళ‌ల‌పై దేశంలో రోజు రోజుకీ వేధింపులు పెరిగిపోతున్నాయి. కొంద‌రు శాడిస్టు భ‌ర్త‌లు చిన్న విష‌యాల‌కే త‌మ భార్య‌ల‌పై దాడి చేస్తున్నారు. కొంద‌రైతే ఏకంగా త‌మ భార్య‌ల‌ను హ‌త‌మారుస్తున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోనూ స‌రిగ్గా ఇలాంటిదే ఓ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే..

దారుణం.. పుట్టింటికి వెళ్తాన‌ని అడిగిన భార్య‌.. కిరోసిన్ పోసి నిప్పు పెట్టిన భ‌ర్త‌..

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని భోపాల్‌లో ఉన్న గౌత‌మ్ న‌గ‌ర్‌కు చెందిన స‌మీర్‌, ష‌బ్‌న‌మ్ ఖాన్ (35)లు దంప‌తులు. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ష‌బ్‌న‌మ్ ఇంటికి స‌మీపంలోనే ఆమె త‌ల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. అయితే ఆమె పుట్టింటికి వెళ్లే విష‌యమై భ‌ర్త‌ను అడిగింది. కానీ అందుకు స‌మీర్ ఒప్పుకోలేదు.

ఈ క్ర‌మంలోనే భార్యా భ‌ర్త మ‌ధ్య గొడ‌వ పెరిగింది. దీంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన స‌మీర్ రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో భార్యపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడు. అనంత‌రం అత‌ను ఇంటి నుంచి పారిపోయాడు.

త‌రువాత ఆమె పెద్ద‌గా కేక‌లు వేయ‌డంతో నిద్ర లేచిన ఆమె పెద్ద కుమారుడు ఇరుగు పొరుగు వారికి, త‌న అమ్మ‌మ్మ‌, తాత‌ల‌కు స‌మాచారం ఇచ్చాడు. దీంతో వారు అక్క‌డికి చేరుకుని త‌మ కుమార్తెను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఆమె ప‌రిస్థితి ప్ర‌స్తుతం 35 శాతం కాలిన గాయాల‌తో అత్యంత విష‌మంగా ఉంది. ఈ మేర‌కు స‌మీర్‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు అత‌ని కోసం గాలిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment