దారుణం.. భోజ‌నం వ‌డ్డించ‌డం ఆల‌స్యం అయింద‌ని భార్య‌ను కొట్టి చంపాడు..

September 21, 2021 2:09 PM

దాంప‌త్య జీవితం అంటే నూరేళ్ల పండుగ‌. కానీ కొంద‌రు ఆ జీవితాన్ని న‌ర‌కం చేసుకుంటుంటారు. చిన్న గొడ‌వ‌ల‌కే విప‌రీత‌మైన ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ప్రాణాల‌ను తీసుకోవ‌డ‌మో లేదా ప్రాణాల‌ను తీయ‌డ‌మో చేస్తుంటారు. తాజాగా అక్క‌డ కూడా ఇలాంటిదే ఓ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే..

దారుణం.. భోజ‌నం వ‌డ్డించ‌డం ఆల‌స్యం అయింద‌ని భార్య‌ను కొట్టి చంపాడు..

జార్ఖండ్‌లోని ఖుంతి జిల్లాలో ఉన్న ఖుంతి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని కాలామ‌తి గ్రామానికి చెందిన హీరామ‌ణి అనే వ్య‌క్తి సోమ‌వారం రాత్రి పీక‌ల‌దాకా మ‌ద్యం సేవించాడు. అనంత‌రం ఇంటికి వ‌చ్చి భార్య‌ను భోజ‌నం వ‌డ్డించ‌మ‌న్నాడు. అయితే ఆమె కొంత ఆల‌స్యం చేసింది. దీంతో రెచ్చిపోయిన హీరామ‌ణి భార్య‌ను చిత‌క బాదాడు.

కాగా హీరామ‌ణి కొట్టిన దెబ్బ‌ల‌కు అత‌ని భార్య తీవ్ర గాయాల పాలైంది. దీంతో స్పాట్‌లోనే చ‌నిపోయింది. విష‌యం తెలుసుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని హీరామ‌ణిని అరెస్టు చేశారు. అత‌ని భార్య మృత‌దేహాన్ని పోస్టుమార్టంకు త‌ర‌లించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment