దారుణం.. విడాకులు ఇచ్చిందని 27 సార్లు కత్తితో పొడిచి చంపిన భర్త..

August 6, 2021 9:48 PM

అగ్ని సాక్షిగా పెద్దల సమక్షంలో మూడుముళ్ల బంధంతో జీవితాంతం తన భార్యకు తోడుగా ఉంటానని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న భర్త ఆమె పాలిట రాక్షసుడిగా మారాడు. కేవలం తనకు విడాకులు ఇచ్చిందన్న కారణంతో తన పై పగ పెంచుకుని సదరు మహిళ పట్ల అత్యంత కిరాతకంగా, ప్రవర్తించిన చంపిన ఘటన అహ్మదాబాద్‌లోని వత్వా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

అజయ్ ఠాకూర్ అనే వ్యక్తి హేమ అనే మహిళను గత కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులపాటు ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి జీవితంలో మనస్పర్థలు తలెత్తాయి. అప్పటికే ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత తన భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో ఎంతో విసుగుచెందిన హేమ తనని దూరం పెడుతూ తనతో స్నేహం చేస్తున్నటువంటి మహేష్ ఠాకూర్ అనే వ్యక్తికి దగ్గరయింది.ఈ క్రమంలోనే తన భర్తకు విడాకులు ఇచ్చి తన ఇద్దరు పిల్లలను అజయ్ దగ్గరే వదిలి మహేష్ ను పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది.

ఈ విధంగా ఇద్దరు పిల్లలను తన వద్ద వదలడంతో వారి సంరక్షణ ఎలా చేపట్టాలో తెలియని మహేష్ ఎంతో మానసికంగా కృంగిపోయాడు. ఈ క్రమంలోనే మద్యానికి బానిసై తన భార్య హేమ పై విపరీతమైన పగ పెంచుకున్నాడు.ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి హేమని చంపాలని ప్రణాళిక వేసుకున్న అజయ్ ఇంట్లో మహేష్ లేని సమయం చూసి తనపై కత్తితో దాడి చేశాడు.అతని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించిన హేమకు సాధ్యం కాలేకపోయింది. ఈ క్రమంలోనే అజయ్ హేమను అతి కిరాతకంగా కత్తితో 27 సార్లు పొడిచి పొడిచి చంపాడు.మహేష్ తిరిగి ఇంటికి వచ్చేసరికి హేమ రక్తపు మడుగులో మృతి చెంది ఉండటం చూసి తన మొదటి భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment