అనుమానంతో భార్యను చంపిన భర్త!

August 9, 2021 9:37 PM

భార్య ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం కారణంగా భర్త ఆమెతో గొడవ పడేవాడు.ఈ క్రమంలోనే తన భార్యపై అనుమానం మరింత పెరగడంతో మద్యంమత్తులో ఏకంగా భార్య పై హత్యాయత్నం చేసి ఆమెను అతి దారుణంగా చంపిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలంలోని అన్నెబోయినపల్లె గ్రామంలో నరసింహ రమణమ్మ భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరికి నలుగురు సంతానం కాగా ఇద్దరు కుమారులకు వివాహమైంది. ఇన్ని రోజులు ఎంతో సుఖంగా సాగిపోతున్న వీరి సంసారంలో పలు అనుమానాలు తలెత్తాయి. తన భార్య ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం రావడంతో నరసింహ ప్రతిరోజూ తాగివచ్చి తన భార్యతో గొడవ పడేవాడు

ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున నరసింహ తన భార్య రమణమ్మతో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో నరసింహ తన భార్య గొంతుకోసి హత్య చేశాడు. దీంతో రమణమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.ఈ విషయం స్థానికులకు తెలియడంతో పోలీసులకు సమాచారాన్ని అందించారు.ఈ క్రమంలోనే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి నరసింహను అదుపులోకి తీసుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment