పెళ్లి పేరుతో మోసం.. జైలుకి వెళ్ళగానే ప్లేట్ మార్చిన యువకుడు..

July 28, 2021 6:16 PM

సాధారణంగా మనం సినిమాలో ఇలాంటి సన్నివేశాలను చూస్తూ ఉంటాము. ఏదైనా తప్పు చేసి జైలుకు వెళితే జైలు నుంచి బయటకు రావడం కోసం ఎన్నో పథకాలు వేస్తుంటారు. అచ్చం అలాంటి ఘట్టన ఢిల్లీలో ఒకటి చోటు చేసుకుంది. భార్యతో గొడవపడి ఆమెను కొండపై నుంచి తోసిన ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

ఉత్తరాఖండ్‌లోని ఉద్ధమ్ సింగ్ నగర్‌కు చెందిన యువకుడు రాజేశ్ రాయ్ ఢిల్లీలో సేల్స్‌మేన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతనికి బబిత అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకుంటానని రాజేష్ మోసం చేశాడు. ఈ విధంగా రాజేష్ మోసం చేయడంతో బబిత పోలీసులను ఆశ్రయించి అతనిపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు అతనిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

ఈ విధంగా అరెస్టయిన యువకుడు తనను పెళ్లి చేసుకుంటానని అందుకోసం కేసు వాపసు తీసుకోవాలని సూచించాడు. ఈ క్రమంలోనే బబిత కేసు వెనక్కి తీసుకోవడంతో వీరిద్దరికీ పెళ్లి జరిగింది. కొద్ది రోజులపాటు సంతోషంగా ఉన్న వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో బబిత పుట్టింటికి వెళ్ళింది. ఈ క్రమంలోనే ఆమెను బాగా చూసుకుంటానని చెప్పి ఈ నెల 11న ఉత్తరాఖండ్‌లోని తన స్వగ్రామానికి తీసుకెళ్లాడు. అదే రోజున ఆమెను నైనిటాల్‌లోని కొండపై నుంచి ఆమెను చూశాడు.

ఈ క్రమంలోనే బబిత తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేయడంతో స్విచ్ ఆఫ్ వచ్చింది. తన అల్లుడిపై అనుమానం రావడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే గతంలో తనపై బబిత ఫిర్యాదు చేసిన కేసు ఆధారంగా అతనిని అరెస్టు చేసి విచారించగా ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆవేశంలో తనని కొండ పైనుంచి తోయడంతో మృతి చెందిందని రాజేష్ ఒప్పుకోవడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకుని మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment