దారుణం.. భార్యపై అనుమానంతో బండలు కొట్టే సుత్తితో తలపై బాది చంపిన భర్త!

August 21, 2021 11:32 AM

అనుమానం పెనుభూతం లాంటిది. ఒక్కసారి ఎవరికైనా అనుమానం కలిగిందంటే ఆ అనుమానం ఎన్నో పరిణామాలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఇలాంటి అనుమానం భార్యాభర్తల మధ్య తలెత్తితే వారి సంసార జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఏర్పడతాయి. ఇలాంటి అనుమానం వల్ల ఎంతో మంది భర్తలు భార్యలను చంపిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

చిట్కుల్ గ్రామానికి చెందిన మెఘవేలు రాజేశ్వరి అనే దంపతులు రాళ్లు కొడుతూ జీవనం సాగించేవారు. ఈ దంపతులకు ఐదు సంవత్సరాల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే రాజేశ్వరి తరచూ తన కుటుంబ సభ్యులతోపాటు ఇతరులతో ఫోన్ లో ఎక్కువగా మాట్లాడుతూ కనిపించింది. ఈ క్రమంలోనే తన భర్త మేఘ వేలు తన భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమాన పడ్డాడు. ఈ క్రమంలోనే అతను ఆమెపై అనుమాన పడుతూ చిత్రహింసలకు గురి చేసేవాడు.

రోజు రోజుకూ రాజేశ్వరి ఫోన్ లో మాట్లాడటం గమనిస్తున్న మేఘవేలుకి తన భార్య రాజేశ్వరిపై అనుమానం పెరిగింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ గొడవ పడ్డారు. ఆ రోజు రాత్రి నిద్రిస్తున్న రాజేశ్వరిపై తన భర్త ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బండలు కొట్టే సుత్తితో తలపై దారుణంగా కొట్టాడు. దీంతో రాజేశ్వరి రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే మృతి చెందింది. అయితే అతను ఆ సుత్తిని తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment