ఫోన్‌లో త‌ర‌చూ మాట్లాడొద్దన్న తండ్రి.. ఆత్మహత్య చేసుకున్న యువ‌తి..

August 3, 2021 3:57 PM

ప్ర‌స్తుత త‌రుణంలో ఆత్మ‌హ‌త్య‌లు అనేవి స‌ర్వ‌సాధార‌ణం అయిపోయాయి. అమ్మ తిట్టింద‌నో, నాన్న కొట్టాడ‌నో, ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అయ్యామనో, ల‌వ్‌లో ఫెయిల్ అయ్యామ‌నో.. చాలా మంది క్ష‌ణికావేశంలో నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఆత్మ‌హత్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. దీంతో త‌ల్లిదండ్రుల‌కు తీర‌ని శోకాన్ని మిగులుస్తున్నారు. తాజాగా ఓ యువ‌తి ఇలాగే క్ష‌ణికావేశంలో ఆత్మహ‌త్య చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే..

girl commits suicide after her dad warned in phone talking

హైద‌రాబాద్ న‌గ‌రంలోని మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న బడంగ్‌పేట చంద్రవిహార్‌కాలనీకి చెందిన లక్ష్మయ్య అనే వ్య‌క్తి కుమార్తె ప్రశాంతి (18) డిగ్రీ రెండో సంవత్సరం విద్య‌ను అభ్య‌సిస్తోంది. అయితే ప్రశాంతి తరచూ ఫోన్ లో మాట్లాడుతుండేది. ఈ క్ర‌మంలో ఆ విష‌యాన్ని ఆమె తండ్రి గ‌మ‌నించాడు.

అయితే ఫోన్‌లో త‌ర‌చూ మాట్లాడొద్ద‌ని, ఎక్కువగా ఉప‌యోగించొద్ద‌ని తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ప్రశాంతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ క్ర‌మంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment